ETV Bharat / city

'రాష్ట్రంలో మొక్కజొన్న గింజల కుంభకోణం' - మొక్కజొన్న కుంభకోణంపై కోదండ రెడ్డి ఆగ్రహం

ఫౌల్ట్రీ ఫెడరేషన్​లో జరుగుతున్న కుంభకోణంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి డిమాండ్ చేశారు. ఈ కుంభకోణంలో ప్రభుత్వ అధికారులు, అధికార పార్టీ నేతలు ఉన్నారని వ్యాఖ్యానించారు.

'బీహార్ గడ్డి కంటే.. తెలంగాణ మొక్కజొన్న పెద్దది'

author img

By

Published : Mar 14, 2020, 11:42 PM IST

ఫౌల్ట్రీ ఫెడరేషన్‌లో భారీ కుంభకోణం జరిగిందని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ఆరోపించారు. బిహార్‌లో జరిగిన గడ్డి కుంభకోణం కంటే మన రాష్ట్రంలో జరిగిన మొక్కజొన్నల కుంభకోణం చాలా పెద్దదని... హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో మొక్కజొన్న రైతులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.

ప్రభుత్వం జోక్యం చేసుకొని సీబీఐ విచారణకు ఆదేశించాలని కోదండరెడ్డి డిమాండ్ చేశారు. చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి సుమారు 34వేల టన్నుల విత్తనాలు తీసుకున్నారని ఆరోపించారు. సన్నకారు, పౌల్ట్రీ రైతులు ఎన్నో దఫాలుగా ప్రభుత్వ అధికారులను కలిసినా ఎలాంటి న్యాయం జరుగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పౌల్ట్రీ ఫెడరేషన్‌లో జరుగుతున్న కుంభకోణంలో ప్రభుత్వ అధికారులు, మంత్రులు ఉన్నారని వ్యాఖ్యానించారు.

'బిహార్ గడ్డి కంటే.. తెలంగాణ మొక్కజొన్న పెద్దది'

ఇవీ చూడండి: మార్చి 31 వరకు అన్ని విద్యాసంస్థలు, థియేటర్లు, బార్లు బంద్​: కేసీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.