హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని... గాంధీభవన్‌లో కాంగ్రెస్ ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. పీసీసీ ప్రధాన కార్యదర్శి మహేశ్‌కుమార్ గౌడ్ ఛైర్మన్‌గా... 14 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసినట్టు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. 150 డివిజన్లకు చెందిన అభ్యర్థుల రోజువారీ ప్రచార కార్యకలాపాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తూ పీసీసీకి నివేదిస్తుంది. అదే విధంగా అభ్యర్ధులకు, సమన్వయకర్తలకు సహాయకారిగా పని చేస్తుందని పేర్కొన్నారు.
కంట్రోల్ రూమ్ కమిటీలో పీసీసీ ప్రధాన కార్యదర్శులు ప్రేమ్‌లాల్, బొల్లు కిషన్, నగేష్ ముదిరాజ్, కైలాస్ కుమార్, అల్లం భాస్కర్, నర్సింగ్‌రావు, భక్తవత్సలం, జానకిరాం, జావెద్ అలీ, కృష్ణకుమార్, బందులాల్, ప్రవీణ్‌కుమార్, వెంకటేశ్ ముదిరాజ్, యాదగిరిని సభ్యులుగా నియమించారు.
ఇదీ చూడండి: బల్దియా పోరు: కాంగ్రెస్ ఐదో జాబితా విడుదల