మంత్రి కేటీఆర్, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్‌పై కాంగ్రెస్ ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్ నిరంజన్.. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. స్కోచ్ అవార్డు విషయంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఫిర్యాదు చేశారు.
రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ... జయేశ్ రంజన్.. ప్రగతి భవన్‌కు వెళ్లి మరీ బెస్ట్ ఫర్ఫార్మింగ్ ఐటీ మినిస్టర్ అవార్డును కేటీఆర్‌కు అందించారని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ ఆరోడాకు ఫిర్యాదుచేశారు. పట్టభద్రులను ప్రభావితం చేసేందుకు ఉద్దేశపూర్వకంగా అధికార యంత్రాంగాన్ని ఉపయోగించారని వివరించారు. స్కోచ్ అవార్డుకు సంబంధించి వివిధ దినపత్రికల్లో వచ్చిన కథనాలను లేఖతో పాటు జతపరిచారు.
ఇవీచూడండి: రాష్ట్రానికి మరోసారి స్కోచ్ అవార్డులు.. ఉత్తమ మంత్రిగా కేటీఆర్