ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్‌కు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై అభినందనలు తెలిపారు. స్వర్ణంతో నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడని కొనియాడారు. అథ్లెటిక్స్‌లో దేశానికి తొలి పతకం అందించాడని ట్వీట్ చేశారు. నీరజ్ చోప్రా స్వర్ణంతో భారత్ కల నెరవేరిందన్నారు.
-
Hearty Congratulations to Neeraj Chopra for winning 1st gold medal for India in Men's Javelin throw.
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) August 7, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
It's a dream come true moment for India #TokyoOlympics2020.
History created and inspired billions of hearts today .
🇮🇳🇮🇳🇮🇳🇮🇳@neerajchopra #Olympics #JavelinDC pic.twitter.com/Jkae7wBeVa
">Hearty Congratulations to Neeraj Chopra for winning 1st gold medal for India in Men's Javelin throw.
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) August 7, 2021
It's a dream come true moment for India #TokyoOlympics2020.
History created and inspired billions of hearts today .
🇮🇳🇮🇳🇮🇳🇮🇳@neerajchopra #Olympics #JavelinDC pic.twitter.com/Jkae7wBeVaHearty Congratulations to Neeraj Chopra for winning 1st gold medal for India in Men's Javelin throw.
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) August 7, 2021
It's a dream come true moment for India #TokyoOlympics2020.
History created and inspired billions of hearts today .
🇮🇳🇮🇳🇮🇳🇮🇳@neerajchopra #Olympics #JavelinDC pic.twitter.com/Jkae7wBeVa
టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో మొట్టమొదటి సారిగా నీరజ్ చోప్రా స్వర్ణ పతకాన్ని సాధించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వందేళ్లుగా స్వర్ణ పతకం కోసం ఎదురు చూస్తున్న భారతీయుల కలలను నీరజ్ చోప్రా నిజం చేశారని అభినందించారు. నీరజ్ చోప్రా విజయం భారతదేశంలోని క్రీడాకారులందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందన్న ముఖ్యమంత్రి.. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరుస్తుండటం సంతోషకరమైన విషయమన్నారు. నీరజ్ చోప్రా విజయం భారతీయులందరికీ గర్వకారణమని సీఎం పేర్కొన్నారు.
టోక్యో ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో జావెలిన్ త్రోలో స్వర్ణ పతకం సాధించిన నీరజ్ చోప్రాకు హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అభినందనలు తెలిపారు. హరియాణా రాష్ట్ర పౌరుడు సైన్యంలో సుబేదారుగా సేవలందిస్తూనే ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో అసమాన పటిమతో భారతదేశానికి తొలి స్వర్ణం సాధించారని కొనియాడారు. ఈ సందర్భంగా నీరజ్ చోప్రాతోపాటు అతని తండ్రి సతీశ్ చోప్రాతో ఫోన్‌లో మాట్లాడి అభినందనలు తెలిపారు.
పురపాలక శాఖ మంత్రి కేటీఆర్... నీరజ్ చోప్రాకు అభినందలు తెలిపారు. అథ్లెటిక్స్‌లో దేశానికి తొలి పతకం అందించాడని కొనియాడారు. నీరజ్ చోప్రాను చూసి దేశం గర్విస్తోందని ట్వీట్ చేశారు. నీరజ్‌కు నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత అభినందనలు తెలిపారు.
-
Congratulations to @Neeraj_chopra1 on winning the first ever #Gold medal for India at @Olympics in Men's Javelin throw. India is proud of you! 👏👏 pic.twitter.com/6g1rkQio30
— KTR (@KTRTRS) August 7, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Congratulations to @Neeraj_chopra1 on winning the first ever #Gold medal for India at @Olympics in Men's Javelin throw. India is proud of you! 👏👏 pic.twitter.com/6g1rkQio30
— KTR (@KTRTRS) August 7, 2021Congratulations to @Neeraj_chopra1 on winning the first ever #Gold medal for India at @Olympics in Men's Javelin throw. India is proud of you! 👏👏 pic.twitter.com/6g1rkQio30
— KTR (@KTRTRS) August 7, 2021
నీరజ్ చోప్రాకు భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అభినందనలు తెలిపారు. భారత్‌కు ఒలింపిక్స్ వ్యక్తిగత విభాగంలో అభినవ్ బింద్రా తర్వాత స్వర్ణం అందించిన రెండో క్రీడాకారుడిగా నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించడం హర్షణీయమన్నారు. ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన నీరజ్ చోప్రా భారత మువ్వన్నెల పతకానికి పసిడి కాంతులద్ది దేశ ప్రజలంతా గర్వించేలా చేశారని కొనియాడారు.
ఒలింపిక్స్ అథ్లెటిక్స్ జావెలిన్ థ్రోలో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించి భారతీయుల కలలను సాకారం చేశాడు. టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం నెగ్గి మువ్వన్నెల పతకానికి పసిడి కాంతులద్దాడు. భారత్‌కు ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో షూటర్ అభినవ్ బింద్రా తర్వాత స్వర్ణం అందించిన రెండో క్రీడాకారుడుగా నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. చోప్రా తెచ్చిన పతకంతో కలుపుకొని ఇప్పటివరకూ జరిగిన ఒలింపింక్స్‌లో భారత్ అత్యధిక పతకాల రికార్డు 6ను అధిగమించి ఏడుకు చేరింది.
జావెలిన్‌ను అత్యుత్తమంగా 87.58 మీ. దూరం విసిరాడు నీరజ్. రెండో ప్రయత్నంలోనే ఈ మార్కును అందుకున్నాడు. చెక్ రిపబ్లిక్కు చెందిన వాద్లెచ్ జాకుబ్(86.67), వెసెలీ విటెజ్స్లావ్(85.44) వరుసగా రజత, కాంస్య పతకాలు సాధించారు.
1900 పారిస్ ఒలింపిక్స్‌లో నార్మన్ ప్రిచర్డ్(బ్రిటీష్ ఇండియా) అథ్లెటిక్స్‌లో (200 మీ. హర్డిల్డ్, 200 మీ. స్ప్రింట్స్) భారత్‌కు రెండు రజత పతకాలు అందించాడు. 120 ఏళ్ల తర్వాత.. మళ్లీ నీరజ్ చోప్రా ఇప్పుడు బంగారు పతకం నెగ్గి చరిత్ర సృష్టించాడు.
ఇదీ చూడండి: చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా- భారత్‌కు స్వర్ణం