ఎంసెట్ ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్లపై గందరగోళం కొనసాగుతూనే ఉంది. నేటి నుంచి ఈ నెల 22 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని షెడ్యూలులో వెల్లడించారు. కానీ ఉదయం నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభం కాకపోవడంతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. కొత్త కోర్సులకు ఎన్ఓసీలు ఇస్తూ నిన్న రాత్రి ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. వాటికి సంబంధించి తుది అనుమతుల ప్రక్రియను యూనివర్సిటీలు ఇంకా చేస్తున్నాయి. ఈ ప్రక్రియ రాత్రి వరకు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
అనుమతుల ప్రక్రియ పూర్తయిన తరువాత కళాశాలలు, సీట్ల వివరాలు వెబ్ సైట్లో పొందుపరచనున్నారు. కాబట్టి వెబ్ ఆప్షన్లు రాత్రి వరకు విద్యార్థులకు అందుబాటులో రావచ్చునని అధికారులు పేర్కొంటున్నారు. ఆ విషయాన్ని వెబ్ సైట్ లేదా అధికారిక ప్రకటన ద్వారా గానీ ఎంసెట్ అధికారులు వెల్లడించకపోవడంతో విద్యార్థుల్లో అయోమయం కొనసాగుతోంది.
ఇదీ చదవండి : కబ్జాకు గురవుతున్నా పట్టించుకోరా.. కార్పొరేటర్‌పై స్థానికుల దాడి