CONFLICT BETWEEN YSRCP AND TDP ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో ఓ స్థల వివాదం వైకాపా, తెలుగుదేశం పార్టీ మధ్య ఘర్షణకు దారితీసింది. కోర్టు పరిధిలో ఉన్న స్థలంలో నిర్మాణానికి వైకాపా వర్గీయులు సిద్ధమవగా.. అడ్డుకునేందుకు తెదేపా నేతలు ప్రయత్నించారు. పనులు చేయకుండా పొక్లెయిన్, టిప్పర్లను అడ్డగించారు. ఈ ఘటనతో మరింత రెచ్చిపోయిన వైకాపా వర్గీయులు.. వాహనాన్ని వేగంగా ముందుకు నడపాలని డ్రైవర్‌కు సూచించారు.
ఆ మేరకు వేగంగా వాహనాలను జనం వైపు నడిపారు. ఈ క్రమంలో రెండు వర్గాల కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. వెంటనే తెలుగుదేశం వర్గీయులపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. అర్బన్ సీఐ మధు మీసం మెలేస్తూ తెలుగుదేశం నాయకులను దూషించారు. ఆ తర్వాత అదనపు బలగాలను రప్పించి ఇరువర్గాలను అక్కడినుంచి పంపించి వేశారు. ఈ గొడవ జరుగుతుండగా అడ్డుకునేందుకు ప్రయత్నించిన తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ చేతికి గాయమైంది.
ఇవీ చదవండి: