దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉందని భజరంగ్‌దళ్ నాయకులు అన్నారు. పుల్వామా దాడిలో మరణించిన సైనికుల చిత్రపటాలకు కోఠి, అబిడ్స్ కూడలిలో పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సంస్కారహీనులు:
ప్రేమికుల రోజు అనే విష సంస్కృతి మనది కాదని.. అది పాశ్చాత్య సంస్కృతి అని బజరంగ్దళ్ రాష్ట్ర కన్వీనర్ సుభాష్ చందర్ తెలిపారు. దాని వల్ల యువత సంస్కారహీనులవుతారని అన్నారు. వాలెంటైన్స్ డే కు విరుద్ధంగా ప్రజలను చైతన్య పరిచేందుకు... తాము ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు.
ఫిబ్రవరి 14ను 'వాలెంటైన్స్ డే' గా కాకుండా.. అమరవీర్ జవాన్ దివస్‌గా జరుపుకుంటున్నట్లు స్పష్టం చేశారు. దేశ భద్రత కోసం అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లను గుర్తు చేసుకోవాలన్నారు.
ఇదీ చూడండి: వ్యాక్సిన్ పేరుతో మత్తు మందు ఇచ్చి నగలు కాజేసింది