ETV Bharat / city

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రకటనల ఆమోదానికి కమిటీలు - telangana Graduate MLC Elections 2021

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రకటనల ఆమోదం, చెల్లింపు వార్తల పరిశీలన కోసం కమిటీలు ఏర్పాటు చేశారు. పెయిడ్ న్యూస్​కు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అధ్యక్షతన ఈ కమిటీ ఏర్పాటయింది.

Graduate MLC Elections Advertising approval and payment news review
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రకటనల ఆమోదానికి కమిటీలు
author img

By

Published : Feb 21, 2021, 9:17 AM IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రకటనల ఆమోదం, చెల్లింపు వార్తల పరిశీలన కోసం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అధ్యక్షతన కమిటీ ఏర్పాటయింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సామాజిక మాధ్యమాల్లో ప్రచురితమయ్యే, ప్రసారమయ్యే వార్తలను పరిశీలించి పెయిడ్ న్యూస్​కు అడ్డుకట్ట వేయనున్నారు.

ఎన్నికల ప్రకటనలకు ఆమోదం తెలిపేందుకు మరో కమిటీ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అదనపు ఎన్నికల ప్రధానాధికారి జ్యోతిబుద్ధ ప్రకాశ్ అధ్యక్షతన ఈ కమిటీ ఏర్పాటయింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు, అభ్యర్థులు.. అన్ని రకాల ప్రకటనలకు కమిటీ అనుమతి తప్పని సరి అని సీఈఓ శశాంక్ గోయల్ ఉత్తర్వులు జారీ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.