ETV Bharat / city

రాష్ట్రంలో గణనీయంగా పెరిగిన వాణిజ్య పన్నుల ఆదాయం - రాష్ట్రంలో ఐటీ ఆదాయం పెరుగుదల

రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ఆదాయం భారీగా పెరుగుతోంది. 2014-15 ఆర్థిక ఏడాదిలో రూ.27 వేల కోట్లు ఉన్న రాబడులు... 2019-20 నాటికి రూ.47 వేల కోట్లకు ఎగబాకాయి. కరోనా ప్రభావం ఉన్నప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరం... గత ఏడాది కంటే ఎక్కువ వృద్ధి నమోదు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

commercial tax
commercial tax
author img

By

Published : Mar 30, 2021, 9:11 AM IST

Updated : Mar 30, 2021, 10:51 AM IST

పెరిగిన పన్నుల ఆదాయం

రాష్ట్రంలో వివిధ శాఖల ద్వారా వచ్చే రాబడులతో పోలిస్తే వాణిజ్య పన్నుల శాఖ ఆదాయం సింహభాగం. వస్తు సేవల పన్నులతో పాటు మద్యం, పెట్రో ఉత్పత్తుల అమ్మకాలపై వ్యాట్‌ ద్వారా ఈ రాబడులు వస్తాయి. అంటే ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయంలో 70 శాతం ఒక్క వాణిజ్య పన్నుల శాఖ నుంచే వస్తుంది. ప్రభుత్వం తీసుకున్న పలు సంస్కరణలతో పన్నుల రాబడులు పెరుగుదల నమోదు చేస్తున్నాయి.

ప్రత్యేక చొరవతో..

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే నాటికి వాణిజ్య పన్నుల శాఖ సర్కిళ్లు అస్తవ్యస్తంగా ఉండి... అధికారులకు తలనొప్పిగా మారాయి. ప్రభుత్వం.. శాఖాపరమైన చర్యలు తీసుకుని 91గా ఉన్న సర్కిళ్లను 118కి పెంచింది. డివిజన్లను 12 నుంచి 14కు పెంచడంతోపాటు 161 పోస్టులు కొత్తగా మంజూరు చేసింది. ప్రతి సర్కిల్‌కు 2 వేల మంది పన్ను చెల్లింపుదారులు ఉండేటట్లు పునర్వవ్యవస్థీకరించింది.

వసూళ్లు ఇలా పెరిగాయి..

పన్ను ఎగువేతదారుల పని పట్టేందుకు సాంకేతికపరంగా చర్యలను విస్తృతం చేసింది. ఐఐటీ హైదరాబాద్‌ సహకారంతో రాబడులను పెంచుకునే దిశలో చర్యలు తీసుకుంది. కొత్తగా 148 మంది ఏసీఓలతో ఖాళీలను భర్తీ చేయడం, సర్కిళ్ల వారీగా అస్తవ్యస్తంగా ఉన్న ఉద్యోగులను.. అవసరాల మేరకు సర్దుబాటు చేయడం లాంటి చర్యల ద్వారా డీలర్లపై పర్యవేక్షణ పెంచింది. అదేవిధంగా డీలర్ల కార్యకలాపాలపై ప్రత్యేకంగా దృష్టి సారించేందుకు... అందుబాటులో ఉన్న సాంకేతికతను ఉపయోగించడం లాంటి చర్యలు తీసుకుంది. ఈ సంస్కరణలతో ఆరేళ్లలో పన్నుల వసూళ్లు అనూహ్యంగా పెరిగాయి.

2020-21లోనూ..

2014-15 ఆర్థిక ఏడాదిలో రూ.27వేల కోట్లు ఉన్న రాబడులు... 2019-20 నాటికి రూ.47 వేల కోట్లకు ఎగబాకాయి. ఈ ఏడాది కరోనా ప్రభావం తీవ్రంగా పడ్డప్పటికీ... దానిని అధిగమించి 2019-20 ఆర్థిక సంవత్సరం కంటే 2020-21లో ఎక్కువ రాబడులు వస్తాయని అంచనా వేస్తోంది. 2020-21 సంవత్సరంలో రూ.54,720 కోట్ల లక్ష్యానికి ఫిబ్రవరి నాటికి రూ.48,960 కోట్ల రాబడులు వచ్చినట్లు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ వెల్లడించింది. నిర్దేశించిన లక్ష్యం మొత్తంలో 94 శాతం సాధించినట్లయిందని... మార్చి 31 నాటికి లక్ష్యాన్ని చేరుకుంటుందని ఉన్నతాకారులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి: 'సాగర్​' పోరుకు సిద్ధమైన ప్రధాన పార్టీలు.. ప్రచారమే తరువాయి..!

Last Updated : Mar 30, 2021, 10:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.