ETV Bharat / city

తగ్గిన వాణిజ్య పన్నుల వసూళ్లు.. కానీ వాటి ద్వారా పెరిగిన రాబడి.. - commercial taxes in december

Commercial Taxes in 2021-22: రాష్ట్రంలో గతేడాది డిసెంబర్‌ నెలలో వాణిజ్య పన్నుల వసూళ్లు 12శాతం తగ్గాయి. పెట్రోల్‌ విక్రయాలపై 25 శాతం, మద్యం అమ్మకాలపై 28 శాతం లెక్కన అమ్మకపు పన్ను రాబడి పెరిగింది. గడిచిన తొమ్మిది నెలల్లో 33 శాతం పెరుగుదల నమోదు చేసి ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యంలో 82 శాతం పన్నులు వసూలు అయ్యాయి.

commercial tax
వాణిజ్య పన్నులు
author img

By

Published : Jan 5, 2022, 1:48 PM IST

Commercial Taxes in 2021-22: రాష్ట్రంలో వాణిజ్య పన్నుల రాబడులు నవంబరు, డిసెంబర్‌ నెలల్లో వరుసగా తగ్గుదల నమోదైంది. అయినా కూడా గత ఆర్థిక ఏడాది ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు వచ్చిన రాబడులను.. ఈ ఆర్థిక సంవత్సరం రాబడులను బేరీజు వేసుకున్నట్లయితే 33శాతం వృద్ధి నమోదైంది. 2021- 22 ఆర్థిక సంవత్సరంలో గడిచిన తొమ్మిది నెలల్లో నిర్దేశించిన లక్ష్యంలో 82శాతం రాబడులు వచ్చాయి. పెట్రోల్‌, మద్యం విక్రయాలపై వచ్చే అమ్మకపు పన్నుతో పాటు జీఎస్టీ రాబడులు గడిచిన తొమ్మిది నెలల్లో గణనీయంగా పెరిగాయి. 2020 డిసెంబర్‌లో రూ.1424.57 కోట్లు జీఎస్టీ పరిహారం రాగా.. 2021 డిసెంబర్‌లో ఒక్క రూపాయి కూడా పరిహారం రాలేదు. దీంతో డిసెంబరు నెలలో వాణిజ్య రాబడులు 12శాతం తగ్గినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

లక్ష్యంలో 82 శాతం

2020-21 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు తొమ్మిది నెలల్లో రూ. 35,534.59 కోట్ల ఆదాయం రాగా 2021-22 ఆర్థిక ఏడాదిలో రూ.47,288.53 కోట్ల రాబడులు వచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో... రూ.57,500 కోట్లు వాణిజ్య పన్నుల ద్వారా వసూలు చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. కాగా ఈ తొమ్మిది నెలల్లో వచ్చిన రాబడులు 82 శాతం లక్ష్యాన్ని పూర్తి చేశాయి. ఈ ఆర్థిక ఏడాది ఏప్రిల్‌- డిసెంబరు వరకు పెట్రోలియం ఉత్పత్తుల అమ్మకం ద్వారా వ్యాట్‌ రాబడి రూ.9771 కోట్లు, మద్యం విక్రయాలపై అమ్మకపు పన్ను రూ.10,132 కోట్లు, ఎస్జీఎస్టీ ద్వారా రూ.10,474 కోట్లు, ఐజీఎస్టీ ద్వారా రూ.10,021 కోట్లు, ఐజీఎస్టీ సెటిల్‌మెంట్‌ ద్వారా రూ.482 కోట్లు, ఇతరత్రా రాబడుల ద్వారా రూ. 5,961 కోట్లు, జీఎస్టీ పరిహారం ద్వారా రూ. 5,961 కోట్లు లెక్కన మొత్తం రూ. 47,288 కోట్లు రాబడులు రాష్ట్రానికి వచ్చాయి.

ఆ రెండు నెలల్లో

ఈ ఆర్థిక ఏడాది ప్రారంభంలో ఏప్రిల్‌ నెలలో కరోనా ప్రభావంతో వాణిజ్య పన్నుల ఆదాయం తగ్గినా... ఆ తరువాత నెల నుంచి రాబడులు గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి. నవంబరు, డిసెంబరు నెలల్లో మాత్రమే అంతకు ముందు ఏడాదిలో వచ్చిన రాబడుల కంటే కొంత తగ్గినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఇదీ చదవండి: 'గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాల మెరుగుపై దృష్టిసారించాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.