గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలకు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని మంత్రులు, తెరాస ప్రధాన కార్యదర్శులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి నేతలకు సూచించారు.
మంత్రులు, శాసనసభ ఉపసభాపతి పద్మారావు, పార్టీ ప్రధాన కార్యదర్శులతో ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. రాజకీయ పరిస్థితులు, కరోనా స్థితిగతులు, ధరణి, రెవెన్యూ సంబంధిత అంశాలు, నీటిపారుదల ప్రాజెక్టులు, పంటల సాగు, కేంద్ర ప్రభుత్వ వైఖరి తదితర అంశాలపై వివరించారు. నేతలంతా డివిజన్ల వారీగా బాధ్యతలు తీసుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి: రేపు సాయంత్రం రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం