ETV Bharat / city

తల్లి ప్రేమ కంటే స్వచ్ఛమైనది సృష్టిలోనే లేదు: సీఎం కేసీఆర్​ - ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు

ఈ సృష్టి మొత్తంలో తల్లి ప్రేమ కంటే గొప్పనైనది, స్వచ్ఛమైనది ఇంకోటి లేదని సీఎం కేసీఆర్​ కొనియాడారు. అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా మాతృమూర్తులందరికీ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఒక మనిషి ఎదుగుదలలో తల్లి పాత్ర గురించి సీఎం వివరించారు.

kcr
kcr
author img

By

Published : May 9, 2021, 3:11 PM IST

అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్​... మాతృమూర్తులకు శుభాకాంక్షలు తెలిపారు. సృష్టిలో తల్లి ప్రేమ ఎంతో గొప్పదని, ఎంతో స్వచ్ఛమైనదని సీఎం కొనియాడారు. ఓర్పు, సహనం, ప్రేమ, త్యాగం వంటి ఎన్నోసుగుణాలను మనం తల్లినుంచే నేర్చుకుంటామని గుర్తు చేశారు.

ఒక మనిషి ఎదుగుదలలో మాతృమూర్తి పాత్ర ఎంతో కీలకమని సీఎం పేర్కొన్నారు. మహిళలు, మాతృమూర్తుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న పలు పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయాని సీఎం తెలిపారు.

ఇదీ చూడండి: నీ అనురాగానికి వెలలేదు .... నీ ప్రేమకు హద్దులేదు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.