కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్‌పై సమీక్షించనున్నారు. ఈ భేటీలో బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు ప్రగతిభవన్ చేరుకున్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయ, వ్యయాలను పరిగణనలోకి తీసుకొని 2021-22 సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. కరోనా, లాక్డౌన్ తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆర్థిక పరిస్థితులు బాగా దెబ్బతిన్నాయి. ఏప్రిల్, మే నెలల్లో సర్కార్ ఖజానాకు ఆదాయం పూర్తిగా పడిపోగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 57 వేల కోట్ల రూపాయల మేరకు కోల్పోయినట్లు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది.
ఇవీచూడండి: ఆదాయ, వ్యయాలకు అనుగుణంగా బడ్జెట్ కసరత్తు