ఆగస్టు 2న నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. హాలియాలో నియోజకవర్గ ప్రగతి సమీక్షలో సీఎం పాల్గొననున్నారు. సాగర్ ఉపఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించనున్నట్లు పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.
సాగర్ ఉపఎన్నిక నేపథ్యంలో నాగార్జునసాగర్, హుజూర్‌నగర్, మిర్యాలగూడ పరిధిలోని ఎత్తిపోతల పథకాలన్నీ పూర్తి చేస్తామన్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఎత్తిపోతల పథకాలపై చర్చించే అవకాశం ఉంది. ఎన్నికల సమయంలో వరాలు కురిపించిన ముఖ్యమంత్రి.. ఆ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రజాప్రతినిధులతో చర్చించేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల సందర్బంగా నియోజకవర్గంలో పర్యటించిన సీఎం.. ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ఆగస్టు 2న పర్యటించేందుకు పూనుకున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన ఖరారైన నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
హాలియాకు ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే నెల 2న రానున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ అధికారులతో, ప్రజా ప్రతినిధులతో సమావేశం కావడం కోసం జిల్లా అధికారులు, ఎమ్మెల్యే నోముల భగత్ స్థలాన్ని పరిశీలించారు. హాలియాలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రాంగణం, మినీ స్టేడియాన్ని పోలీసులు పరిశీలించారు. ఆగస్టు 2న సీఎం కేసీఆర్ రాక సందర్భంగా నూతన ఐటీఐ కళాశాల అయితేనే అన్ని సదుపాయాలు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. సాగర్ ఉపఎన్నికల వేళ బహిరంగ సభలో నాగార్జున సాగర్ నియోజకవర్గాన్ని మళ్లీ సందర్శిస్తానని సీఎం కేసీఆర్ ప్రసంగంలో తెలిపారు. సీఎం పర్యటన నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమావేశానికి సన్నద్ధం అవుతున్నారు.
పేదల ఆకలి తీర్చే నాయకుడు:జగదీశ్ రెడ్డి
నాగార్జున సాగర్ ఉపఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుపై సమీక్షించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగస్టు 2న హాలియాలో పర్యటించనున్నట్లు మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. మునుగోడులో ఆహార భద్రత కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి... పేదల ఆకలి తీర్చే నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. నల్గొండ జిల్లాపై కేసీఆర్‌కు ఎనలేని ప్రేమ ఉందని జగదీశ్ రెడ్డి తెలిపారు.
26సార్లు సందర్శించారు..
ఆగస్టు 2న నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. హాలియా మండల కేంద్రంలో జరిగే ప్రగతి సమీక్షలో పాల్గొననున్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా పర్యటించని విధంగా... ఉమ్మడి నల్గొండ జిల్లాను 26 సార్లు సీఎం కేసీఆర్ సందర్శించారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఫ్లోరైడ్ ప్రభావంతో వెయ్యి గ్రామాలు ఆగమైన జిల్లా నల్గొండ జిల్లా. దీనిపై ప్రత్యేకంగా ముఖ్యమంత్రి దృష్టి సారించి ఈ జిల్లాను సందర్శించనున్నారు. జగదీశ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి
ఇదీ చదవండి: KTR: మహిళా పారిశ్రామిక వేత్తలకు అండగా ఉంటాం: కేటీఆర్