జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సింగిరెడ్డి నారాయణ రెడ్డి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించారు. కవిగా, సినీ గీతాల రచయితగా, పలు సాహితీ ప్రక్రియలను కొనసాగించిన సినారె... తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేశారని సీఎం అన్నారు. గజల్ వంటి ఉర్దూ సాహితీ సాంప్రదాయానికి గౌరవమిచ్చి, తెలంగాణ సాహిత్యాన్ని గంగా జమునా తెహజీబ్కు ప్రతీకగా నిలిపారని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.
రాజ్యసభ సభ్యునిగా, వివిధ విశ్వవిద్యాలయాలకు ఉపకులపతిగా ఆయన చేసిన సేవలు విలువైనవని కొనియాడారు. కరీంనగర్ బిడ్డగా తెలుగు సాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన సినారె... తెలంగాణ భాష, సాహిత్య రంగానికి చేసిన సేవ చిరస్మరణీయమని ముఖ్యమంత్రి తెలిపారు. సి.నారాయణ రెడ్డి సాహితీ సేవకు గుర్తుగా హైదరాబాద్లో 'సినారె సారస్వత సదనం' నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని సీఎం కేసీఆర్ చెప్పారు.
ఇదీ చదవండి: CM KCR: ఆగస్టు 2న సాగర్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటన