ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, గెజిటెడ్ అధికారులతో భేటీ కానున్నారు. శాసనసభ సమావేశాలు జరుగుతున్నందున ముందుగా సభలో వేతన సవరణ, పదవీ విరమణ వయస్సు పెంపు తదితర నిర్ణయాలను ప్రకటించనున్నట్లు తెలిసింది. ఆ తర్వాత ఉద్యోగ సంఘాలతో భేటీ అయి కార్యాచరణను తెలియజేస్తారు.
సోమవారం నాడు బడ్జెట్‌కు సమాధానం సందర్భంగా సీఎం తమ హామీల అమలును ప్రకటించవచ్చని ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి. ఆ రోజు కాకపోతే ఈ నెల 26న ఆయన ద్రవ్య వినిమయ బిల్లు చర్చలో సీఎం వరాలను ప్రకటించే వీలుంది. ఇప్పటికే ప్రభుత్వ అధికారులు దీనిపై జాబితాను రూపొందిస్తున్నారు. మరోవైపు ఉద్యోగ నియామకాల షెడ్యూలును సైతం సీఎం ఖరారు చేయనున్నారని సమాచారం.
- ఇదీ చదవండి : ప్రగతి భవన్లో కేసీఆర్‌ను కలిసిన సురభి వాణీదేవి