ETV Bharat / city

రాష్ట్రంలో విద్యా సంస్థల ప్రారంభంపై నేడు స్పష్టత - కేసీఆర్ తాజా వార్తలు

రాష్ట్రంలో విద్యా సంస్థల ప్రారంభంపై నేడు స్పష్టత రానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై నేడు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం అనుమతిస్తే.. ఈనెల 18 లేదా 20న ప్రత్యక్ష తరగతులు మొదలుపెట్టేందుకు విద్యాశాఖ సిద్ధంగా ఉంది. పరీక్షల విధానంలో మార్పులు, టెట్ వంటి అంశాలపైనా సీఎం నేడు సమీక్షించనున్నారు.

cm kcr take decision on today schools and colleges reopen in Telangana
రాష్ట్రంలో విద్యా సంస్థల ప్రారంభంపై నేడు స్పష్టత
author img

By

Published : Jan 11, 2021, 3:54 AM IST

రాష్ట్రంలో విద్యాసంస్థలు ఎప్పుడు తెరవాలి? ఏతరగతులకు ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలి? అనే కీలక అంశాలపై.. నేడు ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. విద్యాశాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో కేసీఆర్‌.. నేడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. కరోనాతో మార్చి 2020లో మూతపడిన పాఠశాలలు, కళాశాలలను క్రమక్రమంగా తెరవాలని అధికారులు భావిస్తున్నారు.

20 రోజుల పాటు పరిశీలన!

తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు ఈనెల 18 నుంచి ప్రత్యక్షతరగతులు ప్రారంభించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించింది. తొమ్మిది, పదో తరగతులు ప్రారంభించిన తర్వాత.. 15, 20 రోజులు పరిశీలిస్తారు. ప్రతికూల అంశాలు లేకపోతే 6 నుంచి ఎనిమిదో తరగతి వరకు తరగతులు మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది ఒకటి నుంచి ఐదువరకు ప్రత్యక్షతరగతులు నిర్వహించవద్దని.. విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. పరీక్షలు లేకుండానే ఈ ఏడాది పైతరగతులకు ప్రమోట్ చేయాలని భావిస్తున్నారు.

ఇంటర్ బోర్డు సైతం..

ప్రభుత్వం అనుమతిస్తే ఈనెల 18 లేదా 20 నుంచి పాఠశాలలు, జూనియర్ కళాశాలలు తెరవాలని ఇంటర్‌ బోర్డు భావిస్తోంది. ఈనెల18 నుంచి.. మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభించేలా ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపింది. ద్వితీయ సంవత్సరం వారికి ఉదయం, మొదటి సంవత్సరం విద్యార్థులకు రెండో షిఫ్టు తరగతులు పెట్టాలని ప్రణాళికలు రచించింది. అలా కాకుంటే రోజు విడిచి రోజు నిర్వహించాలని.. ప్రతిపాదనల్లో సూచించింది.

ఇతర డిగ్రీ, పీజీ విద్యార్థులకు ..

ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ఇప్పటికే సగంమంది సిబ్బంది హాజరవుతుండగా... గర్భిణీలు మినహా బోధన, బోధనేతర సిబ్బంది అంతా కచ్చితంగా కాలేజీలకు వెళ్లాలని ఇటీవలే ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఇంజినీరింగ్, ఇతర డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఈవిద్యా సంవత్సరంలో ఆన్‌లైన్ పాఠాలతోనే పూర్తిచేయాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది.

ప్రశ్నాపత్రాల రూపకల్పనపై..

ఇంటర్, పదోతరగతి పరీక్షల విధానంలో.. కీలక మార్పులు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పదో తరగతిలో ఏడు పరీక్షలే నిర్వహించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సగం బహుళైచ్ఛిక ప్రశ్నలు ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. ఇంటర్‌ ప్రశ్నపత్రంలోనూ ఛాయిస్‌లు ఎక్కువగా ఇవ్వాలని నిర్ణయించారు.

టెట్ నిర్వహణ, పదోన్నతులు..

త్వరలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ చేయనున్నందున టెట్‌పరీక్ష ఎప్పుడు, ఎలా నిర్వహించాలనే అంశంపైనా నేడు జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీసీల నియామకం, ఉపాధ్యాయులకు పదోన్నతి, బోధన, బోధనేతర ఖాళీలపై ఇవాళ్టి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

ఇవీ చూడండి: విదేశాల్లోని అక్రమాస్తులపై దర్యాప్తునకు ప్రత్యేక విభాగం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.