ఎఫ్ఆర్బీఎం పరిమితిని కేంద్రం మార్చుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై కర్ర పెత్తనం చేస్తోందని, తమ వైఖరి మార్చుకోవాలని ప్రధానికి తాను విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. రాష్ట్ర అప్పులు 21శాతం మేర మాత్రమే ఉన్నాయని, విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన అమెరికా, చైనా, జపాన్ లాంటి దేశాలను తాము అనుసరిస్తున్నామన్నారు. రాష్ట్రం కోసం తెచ్చిన అప్పులతో పెట్టుబడి పెట్టామని తెలిపారు. కాళేశ్వరం మీద పెట్టిన డబ్బులపై విపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయన్నారు. కాళేశ్వరం ద్వారా రాష్ట్రంలో 45లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
ఇవీ చూడండి :దేశ ఆర్థిక వృద్ధిలో తెలంగాణది ముఖ్యపాత్ర: సీఎం కేసీఆర్