CM KCR Speech: ఉద్యోగుల విషయంలో ఏపీది అర్ధరహితమైన వాదన అని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ఉద్యోగుల విభజనపై కొర్రీలు పెడుతున్నారని పేర్కొన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్య సుప్రీంకోర్టుకు వెళ్లిందని తెలిపారు. నియామకాలపై అర్ధరహిత వివాదాలు సృష్టించారని వివరించారు. వివాదాలను ఏపీ ప్రభుత్వం తెగనివ్వడం లేదని మండిపడ్డారు. వివాదాలు తెగకపోవడం వల్లే ఉద్యోగాల భర్తీ చేపట్టలేకపోయామని స్పష్టం చేశారు. తెలంగాణ ఆస్తుల విషయంలో వివాదాలు సృష్టిస్తున్నారన్నారు. తెలంగాణలోని ఆర్టీసీ ఆస్పత్రిలో వాటా కోరుతున్నారన్నారు. ఈ వివాదాలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించడం లేదన్నారు.
తెలంగాణకు నీళ్ల వాటా కోసం ఇప్పటికీ పోరాడుతున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో నీళ్లు, విద్యుత్ సమస్యలు పరిష్కరించుకున్నామని.. అద్భుతంగా పంటలు పండుతున్నాయని వివరించారు. చివరికి రాష్ట్రంలో పంటలను కొనలేమని కేంద్రమే చేతులెత్తేసిందన్నారు. 14 ఏళ్ల సుదీర్ఘ ఘర్షణ తర్వాత తెలంగాణ సాకారమైందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ తనను తాను నిర్వచించుకోవాలని ఆకాంక్షించారు. రాజకీయాలంటే తమకు పవిత్రమైన కర్తవ్యమని.. ఉద్యమ సందర్భంగా ఏం చేశామో ప్రజలకు తెలుసన్నారు. ఇటీవలి వరకు తెరాస నేతలు రైల్వే కేసులు ఎదుర్కొన్నారన్నారు. రాష్ట్రాన్ని బాధ్యతగా ముందుకు తీసుకెళ్లడంలో సఫలమయ్యామన్నారు.
"తెలంగాణ నినాదం.. నీళ్లు, నిధులు, నియామకాలు. తెలంగాణ భాష అంటే ఒకప్పుడు హాస్యాస్పదంగా ఉండేది. ఇప్పుడు తెలంగాణ భాష పెడితేనే సినిమా హిట్ అవుతోంది. తెలంగాణ సంస్కృతి, పండుగలను కాపాడుకున్నాం. సమ్మక్క-సారక్క జాతర, సేవాలాల్ జయంతి అధికారికంగా జరుపుతున్నాం. ఉద్యోగుల విషయంలో ఏపీది అర్ధరహితమైన వాదన. ఉద్యోగుల విభజనపై కొర్రీలు పెడుతున్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్య సుప్రీంకోర్టుకు వెళ్లింది. నియామకాలపై అర్ధరహిత వివాదాలు సృష్టించారు. తెలంగాణ ఆస్తుల విషయంలో వివాదాలు సృష్టిస్తున్నారు. తెలంగాణలోని ఆర్టీసీ ఆస్పత్రిలో వాటా కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం సమస్యలను పరిష్కరించడం లేదు. వివాదాలు తెగకపోవడం వల్లే ఉద్యోగాల భర్తీ చేపట్టలేకపోయాం." - సీఎం కేసీఆర్
ఇదీ చూడండి: