KCR reaction on VRO problems: అసెంబ్లీ సమావేశాల్లో వీఆర్ఏల అంశం చర్చకు వచ్చింది. వీఆర్‌ఏలు చేస్తున్న ఆందోళన అర్థమహితమంటూ కేసీఆర్ పేర్కొన్నారు. అర్హులైన వీఆర్ఏలకు పేస్కేల్ ఇచ్చి వివిధ శాఖల్లో సర్దుబాటు హామీ ఇచ్చారు. త్వరలోనే వీటిపై విధివిధానాలు రూపొందిస్తామని వీఆర్‌ఏలు అధైర్యపడవద్దొని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. వెంటనే వారు తమ ఆందోళనలు విరమించాలని కూడా కేసీఆర్ సూచించారు.
మరోవైపు వీఆర్‌ఏలు చేపట్టిన ఆందోళన ఇవాల్టికి 50రోజులకు చేరింది. ప్రభుత్వం ప్రకటించిన పే స్కేలు, ఉద్యోగ క్రమబద్ధీకరణను అమలు చేయాలంటూ వారు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. జీతాాలు అందకపోవడం, ఆర్థిక ఇబ్బందులతో ఆదివారం కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున గ్రామ రెవెన్యూ సహాయకులు మరణించినట్లు వీఆర్‌ఏ ఐకాస పేర్కొంది. సమ్మె ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ముగ్గురు వీఆర్‌ఏలు ఆత్మహత్య చేసుకోగా, 25 మంది గుండెపోటు, ఇతర అనారోగ్య కారణాలతో మరణించారని తెలిపింది. ఉద్యోగ భద్రతపై అనుమానాలతోనే వీఆర్‌ఏలు ఆందోళన చెందుతూ ప్రాణాలొదులుతున్నారని, వెంటనే స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలంటూ వీఆర్‌ఏ ఐకాస ప్రభుత్వాన్ని కోరుతోంది.
ఇవీ చదవండి: