ETV Bharat / city

తెలంగాణ న్యాయవ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలవాలి: సీఎం కేసీఆర్‌ - సీఎం కేసీఆర్‌

CM KCR speech: హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్‌లో నిర్వహించిన తెలంగాణ న్యాయాధికారుల సదస్సు- 2022లో ముఖ్య అతిథులుగా సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. తెలంగాణలో బెంచ్‌ల పెంపుపై ఆనందం వ్యక్తం చేసిన కేసీఆర్‌.. అందుకు అనుగుణంగా సిబ్బంది కూడా కావాలన్నారు.

CM KCR speech at telangana state judicial officers conference 2022

author img

By

Published : Apr 15, 2022, 11:05 AM IST

Updated : Apr 15, 2022, 12:00 PM IST

తెలంగాణ న్యాయవ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలవాలి: సీఎం కేసీఆర్‌

CM KCR speech: రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని... న్యాయరంగంలోనూ పురోగమించేలా కృషిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్‌లో తెలంగాణ న్యాయాధికారుల సదస్సును... సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, హైకోర్టు సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కలిసి ప్రారంభించారు. సదస్సుకు ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర హాజరయ్యారు. పరిపాలన సంస్కరణలు తీసుకొచ్చి 33 జిల్లాలు ఏర్పాటు చేశామని.... ఆయా జిల్లాల్లో కొత్తగా జిల్లా కోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. హైదరాబాద్‌పై సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణకు అమితమైన ప్రేమ ఉందని.... హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. న్యాయవ్యవస్థ సమర్ధంగా పనిచేయడం కోసం అదనపు సిబ్బందిని మంజూరు చేసినట్లు వివరించారు.

"8 ఏళ్ల క్రితం తెలంగాణ.. రాష్ట్రంగా ఆవిర్భవించింది. అందరి సహకారంతో చక్కగా పురోగమిస్తోంది. పటిష్ట ఆర్థిక పురోగతిని సాధిస్తున్నాం. విద్యుత్‌ రంగంలో అద్భుతమైన పురోగతి సాధిస్తున్నాం. వ్యవసాయ, పారిశ్రామిక రంగంలో ముందుకెళ్తున్నాం. పరిపాలన సంస్కరణలు తీసుకొచ్చి 33 జిల్లాలు ఏర్పాటు చేశాం. తెలంగాణ రాష్ట్ర న్యాయ పరిపాలన విభాగం ఇంకా ముందుకెళ్లాలి. హైదరాబాద్‌ పట్ల జస్టిస్‌ ఎన్‌.వి.రమణకు చాలా ప్రేమ ఉంది. సుదీర్ఘ కాలం పనిచేసినందున జస్టిస్‌ ఎన్‌.వి.రమణకు అన్ని విషయాలు తెలుసు. తెలంగాణలో బెంచ్‌ల పెంపుపై ఆనందంగా ఉంది. బెంచ్‌ల పెంపునకు అనుగుణంగా సిబ్బంది కూడా కావాలి. జిల్లా కోర్టులకు అదనపు సిబ్బందిని కేటాయింపు జరుగుతోంది. జిల్లాల్లో కోర్టు భవనాల కోసం స్థల సేకరణ జరుగుతోంది. హైకోర్టు జడ్జిలకు హోదాకు తగ్గ స్థాయిలో 42 మంది జడ్జిలకు క్వార్టర్స్‌ నిర్మాణం చేస్తున్నాం." - సీఎం కేసీఆర్​

ఇవీ చూడండి:

Last Updated : Apr 15, 2022, 12:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.