ETV Bharat / city

పోరాడైనా కృష్ణా, గోదావరి జలాలను దక్కించుకుంటాం: కేసీఆర్

CM KCR SPEAKS ON KRISHNA AND GODAVARI RIVER WATER DISTRIBUTION
పోరాడైనా కృష్ణా, గోదావరి జలాలను దక్కించుకుంటాం: కేసీఆర్
author img

By

Published : Jul 30, 2020, 8:38 PM IST

Updated : Jul 31, 2020, 4:54 AM IST

20:35 July 30

పోరాడైనా కృష్ణా, గోదావరి జలాలను దక్కించుకుంటాం: కేసీఆర్

గోదావరి, కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటాను ఎట్టి పరిస్థితుల్లో సమగ్రంగా, సమర్థంగా వినియోగించుకోవాలి. రాజీలేని వైఖరిని అనుసరించాలి. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి రంగంలో తెలంగాణ అనేక కష్టనష్టాలకు గురైంది. ఇప్పుడు రెండు నదుల్లో ఉన్న రాష్ట్ర హక్కును, నీటి వాటాను కాపాడుకోవాలి. ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదు’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో నీటి వివాదాలపై గురువారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశం తీర్మానించింది. దీనికోసం ఎంతటి పోరాటానికైనా ప్రభుత్వం  సిద్ధంగా ఉంటుందని సమావేశంలో ఉమ్మడి అభిప్రాయం వ్యక్తమైంది.

ఆగస్టు 20 తరువాతనే ఎపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం..

 ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నడుమ నెలకొన్న జలవివాదాల పరిష్కారం కోసం కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఎపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని వచ్చే నెల 5వ తేదీన నిర్వహించాలని నిర్ణయించింది. దీనిపై అభిప్రాయం చెప్పాల్సిందిగా ఆ శాఖ కార్యదర్శి యూసీసింగ్‌ రాసిన లేఖపై నీటిపారుదల శాఖ నిపుణులు, అధికారులతో ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. పరిష్కారానికి అనుసరించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. ఆగస్టు 20 తరువాతనే ఎపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించాలని కేంద్ర జలవనరుల శాఖకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాయాలని సమావేశంలో నిర్ణయించారు.
కేంద్రం నిర్ణయించిన తేదీన ముందుగా ప్రభుత్వం నిర్ణయించిన కార్యక్రమాలుండటం వల్ల అసౌకర్యంగా ఉటుందన్నారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, నీటిపారుదల శాఖ సలహదారు ఎస్‌కే జోషి, సీఎంఓ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్న సమావేశంలో వివాదాలపై లోతుగా చర్చించారు.

కేంద్ర ‘జలశక్తి'  పనితీరు హాస్యాస్పదం..

రాష్ట్రాల జల వివాదాల పరిష్కారం విషయంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ పనితీరు హాస్యాస్పందంగా ఉందని సమావేశంలో అసంతృప్తి వ్యక్తమైంది. కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నీటి వాటాల పంపిణీ సవ్యంగా పూర్తిచేసే సంప్రదాయం ఉంది. ఈ విషయంలో కేంద్రం పూర్తిగా విఫలమైంది. రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాలు లేని పరిస్థితుల్లో కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో నీటి పంపిణీ జరగాలి. వివాదాలు ఉంటే పరిష్కార బాధ్యతను ట్రైబ్యునల్‌కు అప్పగించాలి. ఏపీ, తెలంగాణ మధ్య ముందు నుంచి వివాదాలు ఉన్న నేపథ్యంలో పునర్విభజన చట్టం సెక్షన్‌-13 ప్రకారం ట్రైబ్యునల్‌కు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి కోరుతున్నా జలశక్తి శాఖ పెడచెవిన పెట్టిందని, కేంద్ర తీరును సమావేశం ఖండించింది. కేంద్రం నిష్క్రియాపరత్వం ప్రదర్శిస్తోందని, ఈ వైఖరిని ఇప్పటికైనా మార్చుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. కేంద్ర బాధ్యతారాహిత్యం వల్ల రెండు రాష్ట్రాలు అనవసరంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని సమావేశంలో చర్చించారు.

న్యాయబద్ధంగా పరిష్కారం కావాలి..

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న కేసులు, ట్రైబ్యునల్‌ వివాదాలు న్యాయబద్ధంగా పరిష్కారం కావాలని, నిరంతరం ఘర్షణ ఎవరికీ మంచిది కాదని సమావేశం అభిప్రాయపడింది. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీరు రాక నష్టపోయిన మహబూబ్‌నగర్‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు నీళ్లు ఇచ్చేందుకు నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలని, అవాంతరాలను లెక్కచేయకుండా వాటిని పూర్తి చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. రాజీలేని పోరాటం ద్వారా నదుల్లో వాటాను వినియోగించుకోవాలని, ప్రాజెక్టుల పనులు శరవేగంగా ముందుకు సాగాలంటూ సమావేశం అభిప్రాయపడింది.

ఇవీచూడండి: 'ఆగస్టు 5న అపెక్స్​ కౌన్సిల్​ సమావేశం'

Last Updated : Jul 31, 2020, 4:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.