ETV Bharat / city

కరోనా విషయంలో హైకోర్టు ఏదడిగినా ఇవ్వండి: కేసీఆర్‌ - cm kcr review on health department

కరోనా విషయంలో హైకోర్టు ఏది అడిగినా ఇవ్వండి: కేసీఆర్‌

author img

By

Published : Jul 21, 2020, 6:08 PM IST

Updated : Jul 21, 2020, 10:30 PM IST

17:51 July 21

కరోనా విషయంలో హైకోర్టు ఏది అడిగినా ఇవ్వండి: కేసీఆర్‌

                       రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండటం వల్ల వైరస్‌ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై మంత్రి ఈటల, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. కరోనాపై వాస్తవాలను అఫిడవిట్‌ రూపంలో సమర్పించాలని అధికారులను ఆదేశించారు. 

                      కరోనా నివారణపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలను అధికారులు సీఎం వద్ద ప్రస్తావించగా..కోర్టుకు  కావాల్సిన సమాచారాన్ని  అందించాలని వైద్యాధికారులకు సీఎం సూచించారు. హైకోర్టు అడిగిన ప్రతి వివరాన్నీ, చేస్తున్న పనినీ తెలపాలని చెప్పారు. 

‘‘  కరోనా విషయంలో ఎవరు పడితే వారు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. హైకోర్టు ఇప్పటికి 87 పిల్స్​ను స్వీకరించింది. నిత్యం కోర్టు విచారణ వల్ల అధికారులకు ఇబ్బంది కలుగుతుంది. కరోనా సోకిన వారికి వైద్యం అందించే విషయంలో క్షణం తీరికలేకుండా పనిచేస్తున్న వైద్యాధికారులు, ఇతర సీనియర్ అధికారులు కోర్టు చుట్టూ తిరగడానికే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది. ఈ క్లిష్ట సమయంలో చేయాల్సిన పని వదిలి పెట్టి కోర్టుకు తిరగడం, విచారణకు సిద్ధమవడంతోనే సరిపోతుంది. దీనివల్ల విధులకు పూర్తి న్యాయం చేయలేకపోతున్నాం. వాస్తవానికి దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పరిస్థితి మెరుగ్గానే ఉంది. మరణాల సంఖ్య తక్కువగా ఉంది. ఎంత మందికైనా వైద్యం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రతిరోజు వేల సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇంత చేసినప్పటికీ హైకోర్టు అలాంటి వ్యాఖ్యలు చేస్తుండడం బాధ కలిగిస్తోంది.‘‘  

                                            - సమావేశంలో పాల్గొన్న పలువులు అధికారులు

             గతంలో కూడా మృతదేహాలకు పరీక్షలు నిర్వహించాలని ఎవరో పిల్స్ దాఖలు చేసిన విషయం సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. దానికి అనుకూలంగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని.. వాస్తవ పరిస్థితిని పరిగణలోనికి తీసుకుని ఆ తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసిందని అధికారులు సీఎంకు గుర్తు చేశారు. అయినప్పటికీ హైకోర్టులో పిల్స్ దాఖలవుతూనే ఉన్నాయని..  హైకోర్టు వాటిని స్వీకరిస్తూనే ఉందని అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు.  

                         ఏకంగా 87 పిల్స్​పై విచారణ జరపడం, వాటికి నిత్యం హాజరు కావడం, చివరికి వివిధ పనుల్లో తీరికలేకుండా ఉండే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్యశాఖ ముఖ్య కార్యదర్శిని, వివిధ వైద్యశాలల సూపరింటెండెంట్లను కూడా కోర్టుకు రావాలని పిలవడం ఇబ్బందిగా ఉందన్నారు. అధికారులు, వైద్యుల విలువైన సమయం కోర్టుల చుట్టూ తిరగడానికే సరిపోతోందని సీఎంకు చెప్పారు. ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పనిచేస్తున్న వైద్య సిబ్బంది స్థైర్యాన్ని తాజా పరిస్థితులు దెబ్బతీస్తున్నాయని సమావేశంలో పాల్గొన్న పలువురు అధికారులు వాపోయారు.

సమావేశంలో వ్యక్తమయిన అభిప్రాయాలను ఓపిగ్గా విన్న ముఖ్యమంత్రి... హైకోర్టుకు పూర్తి వాస్తవాలను అఫిడవిట్ రూపంలో అందించాలని ఆదేశించారు. 

Last Updated : Jul 21, 2020, 10:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.