ETV Bharat / city

దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలి: సీఎం కేసీఆర్​

author img

By

Published : Jun 27, 2021, 4:28 AM IST

పల్లెలు, పట్టణాల అభివృద్ధిని నిరంతర ప్రక్రియగా భావించాలని, ప్రజా అవసరాలే ప్రాధాన్యతగా విధులు నిర్వర్తించాలని సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగానికి సూచించారు. అన్నిరంగాల్లో దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేలా పాలనావ్యవస్థ రూపుదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. వచ్చే నెల ఒకటి నుంచి ప్రారంభమయ్యే పల్లె, పట్టణప్రగతిలో ప్రజలను మరింతగా చైతన్యపరచి నిర్దేశిత లక్ష్యాలన్నింటినీ చేరుకోవాలని సీఎం స్పష్టం చేశారు.

cm kcr review on Rural and urban progress

వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. మంత్రులు, ఉన్నతాధికారులు, కలెక్టర్లు, స్థానికసంస్థల అదనపు కలెక్టర్లు, జిల్లా అటవీ, పంచాయతీ అధికారులు, అటవీ సంరక్షకులు, డీఆర్డీఓలు, అధికారులతో సుధీర్ఘంగా సమావేశమైన సీఎం... కార్యాచరణపై వారికి దిశానిర్దేశం చేశారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలను మరింతగా చైతన్యపరిచి నిర్దేశిత లక్ష్యాలన్నింటినీ చేరుకోవాలన్న సీఎం... ఆ తర్వాత ఏ పని కూడా అపరిష్కృతంగా ఉండరాదని అధికారులకు స్పష్టం చేశారు. పంచాయతీ రాజ్ శాఖకు ప్రభుత్వం అన్నిరకాలుగా సహకరిస్తున్నప్పటికీ పనులు ఎందుకు పూర్తి కావడం లేదన్న విషయాన్ని సమీక్షించుకోవాలని సూచించారు. పల్లెలు, పట్టణాల అభివృద్ధి కోసం అత్యవసర నిధులుగా మంత్రుల వద్ద రెండు కోట్లు, కలెక్టరు వద్ద కోటి రూపాయలు ఉంచుతున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులను ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు స్థానిక మంత్రి అనుమతితోనే ఖర్చు చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. పల్లెలు, పట్టణాల అభివృద్ధిలో జిల్లా కలెక్టర్లే కీలకమని... సమర్థమైన బృందాన్ని ఎంపిక చేసుకొని అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. గ్రామాల్లో ఇండ్ల మీద నుంచి హెచ్​టీ విద్యుత్తు లైన్లను తొలగించాలని సీఎం ఆదేశించారు. విద్యుత్ సమస్యలు అధిగమించేందుకు పవర్ డేను పాటించాలని... శ్రమదానంతో సమస్యలు పరిష్కరించుకోవాలని తెలిపారు. హరితహారంలో భాగంగా గ్రామాల్లో ప్రతి ఇంటికీ ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేయాలని చెప్పారు.

లేఅవుట్లలో ప్రజావసరాల కోసం కేటాయించిన భూమిని విధిగా గ్రామపంచాయతీలు, మున్సిపాల్టీల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. పట్టణాల వారీగా క్లీనింగ్ ప్రొఫైల్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లో అన్నిశాఖలకు చెందిన విశ్రాంత ఉద్యోగులు, మాజీ సైనికుల జాబితా తయారు చేసి... ప్రగతి కార్యక్రమాల్లో వారి సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. ఆయా శాఖల మధ్య ఉన్న బకాయిలను జూలై నెలాఖరుకల్లా బుక్ అడ్జస్ట్ మెంట్ ద్వారా పరిష్కరించాలన్న సీఎం... ఇక నుంచి బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని, ప్రతి పట్టణంలో కనీసం ఐదు డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసుకోవాలని... అందుకోసం పట్టణాలకు దగ్గరలో స్థలాలు సేకరించి పెట్టుకోవాలని చెప్పారు. హెచ్ఎండీఏ పరిధిలో పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, భవిష్యత్తులో హైదరాబాద్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని మౌలిక వసతుల అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు. కొత్త సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు తరలుతున్న ప్రభుత్వ కార్యాలయాల స్థలాలు, ఆస్తులను కలెక్టర్లు స్వాధీనం చేసుకొని ప్రజావసరాల కోసం వినియోగించాలని తెలిపారు. పట్టణాల్లో లక్ష జనాభాకు ఒకటి చొప్పున శాఖాహార, మాంసాహార మార్కెట్లు ఏర్పాటు చేయాలని... ఇందుకోసం కనీసం రెండు, మూడు ఎకరాలకు తక్కువ కాకుండా స్థలాన్ని ఎంపిక చేసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. మ్యాప్ యువర్ టౌన్ ప్రకారం పట్టణ ప్రణాళికలు రూపొందించుకొని పది రోజుల సమయాన్ని సమర్థంగా వినియోగించుకొని పట్టణాల్లో లోపాలను సవరించుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, రాష్ట్రస్థాయి అధికారులు వివిధ జిల్లాల్లో పర్యటనలు చేపట్టిన సందర్భాల్లో సమీక్షల కోసం ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర చాంబర్ ఏర్పాటు చేయాలని తెలిపారు. అన్ని కలెక్టరేట్లలో జంట హెలిపాడ్లు నిర్మించాలని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన భూములు, స్థలాలు, ఇతర ఆస్తుల వివరాలతో జూలై నెలాఖరుకల్లా ఇన్వెంటరీలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వ భూములు ఆస్తుల వివరాలు రికార్డు చేసి, వాటి సంరక్షణ, పర్యవేక్షణ కోసం రాష్ట్రస్థాయిలో, జిల్లా స్థాయిలో ఎస్టేట్ అధికారులను నియమించాలని చెప్పారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా అర్బన్ లాండ్ ను శాస్త్రీయంగా వినియోగించే విషయంలో రియోడిజనీరో నగరాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. కొండలు, గుట్టలున్న ప్రాంతాల్లో విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాలను చేపట్టాలన్న ఆయన... మండలానికి ఒకటి చొప్పున పది ఎకరాల స్థలంలో ప్రకృతి వనాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రజావసరాలరీత్యా భూమి అవసరమైన చోట చట్ట ప్రకారం భూసేకరణ చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అటవీ పునరుజ్జీవం మీద కలెక్టర్లు ప్రత్యేకంగా దృష్టిసారించాలని... వివాదం లేని అటవీ భూముల్లో ముందుగా పునరుజ్జీవన చర్యలు ప్రారంభించాలని చెప్పారు. పోడు భూముల సమస్యల పరిష్కారం కోసం సమగ్ర నివేదిక తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా రికార్డుల్లో ఉన్న 66 లక్షల ఎకరాల అటవీ భూముల హద్దులను నిర్దిష్టంగా గుర్తించాలని అటవీఅధికారులకు స్పష్టం చేశారు. జాతీయ రహదారుల వెంట పచ్చదనాన్ని పెంచే బాధ్యత ఆయా గుత్తేదార్లదేనని, ఈ విషయంలో వారిని చైతన్యపరిచి రహదారుల వెంట మొక్కలు నాటే కార్యక్రమాలను విస్తృతం చేయాలని చెప్పారు. వైకుంఠ ధామాలు తదితర ప్రగతి పథకంలో భాగంగా చేపట్టిన నిర్మాణాలకు సంబంధించిన పెండింగ్ బిల్లులను విడుదల చేశామని, సోమవారం కల్లా ఖాతాల్లో జమవుతాయని సీఎం తెలిపారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఖర్చుల కోసం నిధుల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. జూలై 1 నుంచి ప్రారంభం కానున్న పల్లె, పట్టణ ప్రగతి కార్య క్రమం కోసం జిల్లాలు, మండలాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్... నిర్ణయాలను పటిష్టంగా అమలు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో వ్యవసాయం దినదినాభివృద్ది చెందుతున్న తరుణంలో కేవలం వ్యవసాయ శాఖ మాత్రమే కాకుండా అన్ని శాఖల అధికారులు సాగుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సీఎం తెలిపారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా రైతుకు వాణిజ్యపరంగా లాభదాయక పంటలను ప్రోత్సహించాలని చెప్పారు. నాటు పద్దతి కాకుండా వెద జల్లే పద్దతి ద్వారా వరి పండించే విధానాన్ని అవలంభించేలా రైతులను చైతన్యం చేయాలని అన్నారు. కంది, శనగ, పత్తి, ఆయిల్ పాం వంటి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని సీఎం కేసీఆర్ తెలిపారు. వ్యవసాయానికి, రైతుకు ప్రభుత్వం అండగా నిలబడడంతో రాష్ట్రంలో సమృద్ధిగా పంటలు పండుతూ ధాన్యాగారంగా మారిందని అన్నారు. రాష్ట్రానికి అదనపు రైస్ మిల్లులు తక్షణమే అవసరమని... వాటి సంఖ్యను పెంచాలని చెప్పారు. పండిన ధాన్యాన్ని ప్రాసెసింగ్ చేసుకోవడంపై ఇపుడు దృష్టి సారించాలన్న ముఖ్యమంత్రి... ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ లను 250 ఎకరాల విస్తీర్ణానికి తక్కువ కాకుండా ఏర్పాటు చేయాలని చెప్పారు. వాటి చుట్టూ బఫర్ జోన్లు ఏర్పాటు చేసి ఆ పరిధిలో లేఅవుట్లు, నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని సీఎం తెలిపారు. కల్తీ విత్తనాల అమ్మకాల మీద కఠినంగా వ్యవహరించాలని... వ్యవసాయ, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. కలెక్టర్లు, జిల్లాల ఉన్నతాధికారులు విశేష అధికారాలను వినియోగించి కల్తీని నిరోధించాలని కేసీఆర్ అన్నారు.

అడవుల్లో స్మగ్లింగ్ ను అరికట్టేందుకు చెక్ పోస్టులను క్రియాశీలం చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో యువతను పక్కదారి పట్టించే అసాంఘిక చర్యల పట్ల పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి గంజాయి వంటి మత్తు పదార్ధాల రవాణాను కఠినంగా అరికట్టాలని డీజీపీని సీఎం ఆదేశించారు. వలస కార్మికుల సంక్షేమం కోసం విధానాన్ని రూపొందించాలని అధికారులకు తెలిపారు.

ఇదీ చూడండి: రాయలసీమ ఎత్తిపోతల పథకం పర్యావరణ అనుమతులు వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.