CM KCR review on paddy procurement: ధాన్యం కొనుగోళ్ల అంశానికి సంబంధించి తదుపరి కార్యాచరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా మంత్రులు, తెరాస లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, అధికారులతో ప్రగతిభవన్‌లో దాదాపు 8గంటలపాటు సమావేశమై వారికి దిశానిర్ధేశం చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర వైఖరిపై సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో ఎంపీలు నిరసన తెలిపినా కేంద్రం స్పందించడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. పార్లమెంట్‌లో ఇకపైనా నిరసన కొనసాగించాలని ఎంపీలకు సీఎం దిశానిర్ధేశం చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం కూడా పార్లమెంట్ ఉభయసభల్లో తెరాస ఎంపీలు నిరసన వ్యక్తం చేయనున్నట్లు సమాచారం.
పార్లమెంట్ వేదికగా కేంద్రం స్పష్టత..
ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణలో నెలకొన్న అయోమయ పరిస్థితుల్లో పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం స్పందించింది. బాయిల్డ్ రైస్ ఎంత కొంటారో స్పష్టం చేయాలంటూ తెరాస సభ్యుడు కె.కేశవరావు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వంతో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారమే ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిన్న పార్లమెంట్‌లో స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌తోనూ మాట్లాడానని.. వానాకాలం పంట పూర్తిగా కొంటామని స్పష్టం చేశారు. ధాన్యం సేకరణ విషయంలో కర్ణాటక నమూనా చాలా బాగుందన్న ఆయన.... అదే నమూనాను అన్ని రాష్ట్రాలు అనుసరిస్తే బాగుంటుందని సూచించారు.
సంబంధిత కథనం..