ETV Bharat / city

కరెంటు ఛార్జీలపై నేడు నిర్ణయం

కరెంటు ఛార్జీలు పెంచాలా వద్దా అనే అంశంపై సీఎం కేసీఆర్‌ నేడు నిర్ణయం తీసుకోనున్నారు. ఛార్జీల పెంపుపై ఈ రోజు ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించే అవకాశముంది.

cm kcr review meeting on electric charges
కరెంటు ఛార్జీలపై నేడు నిర్ణయం
author img

By

Published : Feb 29, 2020, 8:29 AM IST

వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కరెంటు ఛార్జీలు పెంచాలా వద్దా అనే అంశంపై సీఎం కేసీఆర్‌ నేడు నిర్ణయం తీసుకోనున్నారు. ఛార్జీల పెంపు ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు శుక్రవారం అందజేశాయి. వాటిపై ఈ రోజు ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష చేసే అవకాశముంది. తర్వాతనే ఛార్జీల విషయమై స్పష్టత ఇస్తారని సమాచారం. సీఎం నిర్ణయం వెలువడ్డాక వచ్చే ఏడాదికి సంబంధించిన ‘వార్షిక ఆదాయ అవసరాల’(ఏఆర్‌ఆర్‌) నివేదికను విద్యుత్‌ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ)కి డిస్కంలు అందజేస్తాయి.

అదనంగా కావాలి..

వచ్చే ఏడాది డిస్కంల ఆదాయ, వ్యయాల మధ్య అంతరం రూ.11 వేల కోట్ల వరకూ ఉంటుందని అంచనా. ఈ సొమ్మును ప్రభుత్వం రాయితీగా బడ్జెట్‌లో కేటాయించాలి. లేనిపక్షంలో ఆ మేర ఛార్జీలు పెంచాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.8 వేల కోట్లను రాయితీ పద్దు కింద బడ్జెట్‌లో ప్రభుత్వం ఇచ్చింది. అవి సరిపోక అదనంగా ఇవ్వాలని డిస్కంలు కోరుతున్నాయి.

బడ్జెట్​లో ఒకే రాయితీ పద్దు కింద ఇవ్వాలి

వ్యవసాయానికి పూర్తి ఉచితంగా కరెంటు ఇస్తున్నారు. ఎత్తిపోతల పథకాలకు గరిష్ఠ రోజువారీ డిమాండు 2200 మెగావాట్ల వరకూ ఉంది. ఎత్తిపోతల పథకాలకు ఇస్తున్న కరెంటుకు నీటిపారుదల శాఖ బిల్లులు చెల్లించాలి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వ్యవసాయం, ఎత్తిపోతలకు ఇవ్వాల్సిన సొమ్మునంతా ఒకే రాయితీ పద్దు కింద బడ్జెట్‌లోనే ఇవ్వాలని డిస్కంలు కోరుతున్నాయి. దీనివల్ల మళ్లీ నీటిపారుదల శాఖను అడగాల్సిన అవసరం ఉండదు.

గత ఐదేళ్లుగా కరెంటు ఛార్జీలు పెంచలేదు. అందువల్ల కొంతమేరకైనా పెంచితే బాగుంటుందని డిస్కంలు కోరుతున్నాయి. రాష్ట్రంలో భారీగా పెరిగిన విద్యుత్‌ డిమాండుపై ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుతో సీఎం కేసీఆర్​ శుక్రవారం సమీక్ష జరిపారు. ఎంత డిమాండు పెరిగినా ఎలాంటి కోతలు లేకుండా సరఫరా చేయాలని సీఎం సూచించారు.

ఇదీ చదవండి: ప్రతి నీటి బొట్టు అమూల్యమైనదే: మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.