నేలలు, వాతావరణాన్ని అనుసరించి హార్టికల్చర్ విధానం రూపొందించాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. ఉద్యాన పంటల సాగు మరింత విస్తరించేలా పరిశోధనలు చేపట్టాలన్నారు. ఉద్యాన శాఖపై ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.
హార్టికల్చర్ యూనివర్సిటీని బలోపేతం చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. ఆధునిక పద్ధతుల్లో ఉద్యాన పంటల సాగుకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఇందుకోసం జయశంకర్ వర్సిటీ ప్రాంగణంలోని 300 ఎకరాలు కేటాయించారు. ఉద్యాన వర్సిటీలో మౌలిక వసతులకు బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామన్నారు.
వంటిమామిడి, రామగిరి ఖిల్లా అగ్రి పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్లు పెంచాలని కేసీఆర్ పేర్కొన్నారు. గజ్వేల్ తరహాలో సమీకృత కూరగాయల మార్కెట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. అన్ని మున్సిపాలిటీలు, ముఖ్య పట్టణాల్లో సమీకృత మార్కెట్లు ఉండాలని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : మంత్రులకు ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్