ETV Bharat / city

ఎస్సై, కానిస్టేబుల్ కటాఫ్ మార్కుల విషయంలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన - పోలీస్ ఉద్యోగాలపై కేసీఆర్ స్పందన

constable notification
constable notification
author img

By

Published : Sep 12, 2022, 1:05 PM IST

Updated : Sep 12, 2022, 2:10 PM IST

13:02 September 12

ఆ పరీక్షల్లో కటాఫ్‌ మార్కులు తగ్గిస్తామన్న సీఎం కేసీఆర్

తెలంగాణలోని పోలీసు నియామక పరీక్షల్లో కటాఫ్‌ మార్కులు తగ్గించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే పలు సంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో శాసనసభలో సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన చేశారు. ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాల అర్హత పరీక్షలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కటాఫ్‌ మార్కులు తగ్గించనున్నట్లు స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కటాఫ్‌ మార్కులు 20 శాతం తగ్గించాలంటూ నిరసన ప్రదర్శనలు జరుగుతున్న నేపథ్యంలో సీఎం ఈ ప్రకటన చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ నియామక పరీక్షలో ఓసీ అభ్యర్థులకు 20 మార్కులు తగ్గించినట్లే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తగ్గించాలని బంజారాహిల్స్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌ని ఎమ్మార్పీఎస్ నాయకులు ముట్టడించారు. బలహీన వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వం అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్ శ్రీనివాసులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి స్టేషన్‌కి తరలించారు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 12, 2022, 2:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.