ETV Bharat / city

భారీ వర్షాలున్నాయ్... అప్రమత్తంగా ఉండాలి : కేసీఆర్ - rains in nizamabad

పలు జిల్లాల్లో మరికొద్ది గంటల్లో భారీ వర్షాలు కురియనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో సీఎం కేసీఆర్​ సీఎస్​ సోమేశ్​కుమార్​తో చర్చించారు. ఆయా జిల్లాల కలెక్టర్లకు, ఎస్పీలకు అప్రమత్తంగా ఉండాలని సీఎస్​ ఆదేశించారు.

cm kcr orders to district collectors on rains

author img

By

Published : Sep 20, 2020, 7:49 PM IST

Updated : Sep 21, 2020, 7:05 AM IST

మరికొద్ది గంటల్లో అదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ముదస్తు చర్యలపై సీఎం కేసీఆర్... సీఎస్​ సోమేశ్​ కుమార్​తో చర్చించారు. ముఖ్యమంత్రి సూచన మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు, ఎస్పీలకు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ సోమేశ్​ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

వర్షం కారణంగా చెట్లు, కరెంటు స్థంభాలు విరిగిపడే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అవసరమైతే నాళాలు, వరద ఉద్ధృతి ఉన్న ప్రాంతాల్లో వారిని పునారావాస కేెంద్రాలకు తరలించాలని తెలిపారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ... ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.

ఇదీ చూడండి: 'రాగల మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం...!'

Last Updated : Sep 21, 2020, 7:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.