ETV Bharat / city

CM KCR Nalgonda Visit: నేడు నల్గొండకు సీఎం కేసీఆర్​.. - నల్గొండకు సీఎం కేసీఆర్​

CM KCR Nalgonda Visit: సీఎం కేసీఆర్​ ఇవాళ నల్గొండకు వెళ్లనున్నారు. ఎమ్మెల్యే గాదరి కిశోర్​కుమార్​ తండ్రి దశదిశకర్మ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇందుకోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు.

CM KCR Nalgonda Visit for Consultation to mla gadhari Kishore Kumar

author img

By

Published : Dec 28, 2021, 9:47 PM IST

Updated : Dec 29, 2021, 12:21 AM IST

CM KCR Nalgonda Visit: సీఎం కేసీఆర్ ఇవాళ నల్గొండకు వెళ్లనున్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ తండ్రి మారయ్య దశదినకర్మ కార్యక్రమంలో సీఎం కేసీఆర్​ పాల్గొననున్నారు. పట్టణంలోని కనకదుర్గ కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో మారయ్య చిత్రపటానికి పూలమాల వేసి.. శ్రద్ధాంజలి ఘటించనున్నారు.

హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్​లో బయలుదేరి.. నల్గొండలోని ఎన్జీ కళాశాల మైదానంలో మధ్యాహ్నం 12 గంటలకు ల్యాండ్​ అవుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ఇంటికి చేరుకుంటారు. ఎమ్మెల్యేను ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి.. భోజనం అనంతరం హైదరాబాద్​కు తిరుగు ప్రయాణమవుతారు.

ఇందుకోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, అధికారులు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ రెమా రాజేశ్వరి కలిసి ఎన్జీ కళాశాల మైదానంలో హెలిప్యాడ్ పనులను, భద్రత ఏర్పాట్లు పరిశీలించారు. పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.

ఇదీ చూడండి:

Last Updated : Dec 29, 2021, 12:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.