ETV Bharat / city

'రాష్ట్రంలో డొమెస్టిక్​ ఎయిర్​పోర్టుల అభివృద్ధికి చర్యలు తీసుకోండి'

cm kcr met with central minister hardeep singh puri in delhi

author img

By

Published : Dec 12, 2020, 2:32 PM IST

Updated : Dec 12, 2020, 3:33 PM IST

14:30 December 12

కేంద్ర మంత్రి హర్‌దీప్‌సింగ్ పురికి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి

దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్​... కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్ పురితో భేటీ అయ్యారు. కేవలం పది నిమిషాలు మాత్రమే సాగిన ఈ సమావేశంలో... రాష్ట్రంలో ఆరు డొమెస్టిక్ ఎయిర్ పోర్టుల అభివృద్ధికి వెంటనే చర్యలు తీసుకోవాలని  హరిదీప్ పురిని సీఎం కేసీఆర్ కోరారు. బసంత్ నగర్, మామునూరు, ఆదిలాబాద్, జక్రం​పల్లి, దేవరకద్ర, భద్రాద్రి కొత్తగూడెంలో విమానాశ్రయాలకు సంబంధించిన డీపీఆర్​లు ఇప్పటికే తయారు చేశారని పేర్కొన్నారు.

ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఈ విమానాశ్రయాలపై సర్వే కూడా జరిపినట్లు కేసీఆర్ వివరించారు. ఈ విమానాశ్రయాలకు సంబంధించిన ప్రతిపాదనలను 2018 లోనే రాష్ట్ర ప్రభుత్వం సమర్పించినట్లు పేర్కొన్నారు. ఈ ఎయిర్ పోర్టుల అభివృద్ధికి అవసరమైన అన్ని అనుమతులను సింగిల్ విండో తరహాలో వచ్చేలా చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రిని కోరారు. 

మరికొందరు  కేంద్రమంత్రులతో సీఎం కేసీఆర్​ సమావేశమయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై కేంద్రమంత్రులతో సీఎం చర్చించనున్నారు. అవకాశం ఉంటే ప్రధాని నరేంద్రమోదీతోనూ కేసీఆర్​ సమావేశం అవుతారని.. ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దిల్లీలో తెరాస కార్యాలయ నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని కేసీఆర్​ పరిశీలించనున్నారు.

ఇదీ చూడండి: అమిత్​షాతో కేసీఆర్​ భేటీ... విపత్తు నిధుల సాయంపై చర్చ

Last Updated : Dec 12, 2020, 3:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.