ETV Bharat / city

కేంద్ర జల్‌శక్తిమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ

CM KCR meets Union Water Energy Minister Gajendrasingh Shekhawat

author img

By

Published : Dec 11, 2020, 6:09 PM IST

Updated : Dec 11, 2020, 7:37 PM IST

18:06 December 11

కేంద్ర జల్‌శక్తిమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ

CM KCR meets Union Water Energy Minister Gajendrasingh Shekhawat
కేంద్ర జల్‌శక్తిమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ

 సీఎం కేసీఆర్‌ దిల్లీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సీఎం సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు జరిగిన భేటీలో.. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులు, కేంద్ర సహకారంపై ఆయన చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మూడు రోజులపాటు కేసీఆర్‌ దిల్లీలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్‌, నితిన్‌ గడ్కరీ, హర్దీప్‌సింగ్‌ పురి‌, నరేంద్రసింగ్‌ తోమర్‌లతో ఆయన సమావేశమయ్యే వీలుంది. 

దిల్లీలో తెరాస కార్యాలయం కోసం కేంద్రం కేటాయించిన స్థలాన్ని కూడా కేసీఆర్‌ పరిశీలించి శంకుస్థాపనపై నిర్ణయం తీసుకోనున్నారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా రైతు సంఘాలు, విపక్షాల నేతలతో సీఎం సమావేశవుతారనే అంచనాలున్నాయి.

Last Updated : Dec 11, 2020, 7:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.