మూడు రోజుల పర్యటనలో భాగంగా దిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్... కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమయ్యారు. 40 నిమిషాల పాటు సాగిన సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై అమిత్ షాతో సీఎం చర్చించారు. ఇటీవల హైదరాబాద్ వరదలకు విపత్తు నిధుల సాయం, విభజన హామీలపై మాట్లాడారు.
కాసేపటి క్రితం కేంద్రజల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సీఎం భేటీ అయ్యారు. గంటపాటు జరిగిన భేటీలో రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టులు, కేంద్ర సహకారం, ఇతర అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ మరికొందరు కేంద్రమంత్రులతో సమావేశమయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి చెందిన అంశాలపై కేంద్రమంత్రులతో సీఎం చర్చించనున్నారు. అవకాశం ఉంటే ప్రధాని నరేంద్రమోదీతోనూ కేసీఆర్ సమావేశం అవుతారని.. ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దిల్లీలో తెరాస కార్యాలయ నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని కేసీఆర్ పరిశీలించనున్నారు.