శతాబ్దాల భూవివాదాలకు చరమగీతం పాడాలనే కొత్త రెవెన్యూ చట్టాన్ని పక్కాగా తీసుకొచ్చినట్లు శాసనమండలిలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. పేద రైతులకు ప్రయోజనంతో పాటు ఒక్క పైసా అవినీతికి తావులేని పద్ధతిలో మూడేళ్లు కష్టపడి చట్టాన్ని రూపకల్పన చేసినట్లు సీఎం వివరించారు. మండలిలో కొత్తరెవెన్యూ బిల్లును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారు. ధరణి పోర్టల్‌లో మార్పులు చేసే అధికారం తహసీల్దార్లకు కూడా లేదని కేసీఆర్ తేల్చిచెప్పారు.
బయోమెట్రిక్, ఐరిస్, ఆధార్, ఫొటోతో సహా అన్ని వివరాలు నమోదుచేస్తేనే... ధరణి పోర్టల్‌లో మార్పులకు అవకాశం ఉంటుందన్నారు. అరగంటలో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, రికార్డుల నవీకరణ ప్రక్రియ మొత్తం పూర్తిచేసే వ్యవస్థ తీసుకొచ్చినట్లు చెప్పారు. రెవెన్యూ కోర్టులు రద్దుచేశామని... వాటి స్థానంలో ఫాస్ట్‌ట్రాక్ ట్రైబ్యునళ్లు పనిచేస్తాయని సీఎం వెల్లడించారు.
ఇదీ చదవండి: రోడ్ల విషయంలో భాజపా నేతలు స్పందించాలి : కేటీఆర్