కరోనాతో పోరాడుకుంటూనే ఆర్థిక కార్యకలాపాలు, ఆంక్షలను కొనసాగించాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఇందుకనుగుణంగా వ్యూహం రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కరోనా ఎంతకాలం ఉంటుందో ఎవరికీ తెలియని పరిస్థితి ఉన్నందున దీని ప్రభావం ఉన్నప్పటికీ జీవితం ఎలా సాగాలనే విషయంలో కచ్చితమైన కార్యాచరణ ప్రణాళిక అవసరమన్నారు. సోమవారం ప్రగతిభవన్‌లో హోంమంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు ఇతర ఉన్నాధికారులతో సమీక్షించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, లాక్‌డౌన్ అమలు తదితర అంశాలపై సీఎం చర్చించారు.
గ్రీన్,ఆరెంజ్ జోన్లలో కొన్ని సడలింపులు అమలవుతున్నాయి. కొన్ని పనులు జరుగుతున్నాయి. ఈ పరిస్థితిలో భవిష్యత్తులో సడలింపులు ఎలా అమలు చేయాలి? ఏ జోన్‌లో ఎలాంటి వ్యూహం అనుసరించాలి? హైదరాబాద్ విషయంలో ఏ చర్యలు తీసుకోవాలి? ఇతర జిల్లాల్లో ఎలా వ్యవహరించాలి? ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి. ఏ విషయాల్లో కఠినంగా ఉండాలి? వంటి అంశాల్లో అధికారులు లోతుగా ఆలోచించి, ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇవ్వాలి. - సీఎం కేసీఆర్
కరోనా వ్యాప్తి నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. వైరస్ సోకిన వారికి ఇప్పటి మాదిరిగానే అత్యుత్తమ సేవలు అందాలన్నారు. కాంటాక్ట్ వ్యక్తులకుË పరీక్షలు కొనసాగాలని తెల్చిచెప్పారు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకకుండా క్వారంటైన్ నిబంధనలు పాటించాలన్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో 61 మంది మహిళా ఖైదీల విడుదల