ETV Bharat / city

సాగునీటి గోసకు శాశ్వత పరిష్కారం: సీఎం కేసీఆర్

కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల్లోని నీటితో... వేసవిలో రాష్ట్రంలోని రిజర్వాయర్లు, చెరువులను నింపేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. దశాబ్దాల తరబడిగా రైతన్న అనుభవించిన గోసకు కాళేశ్వరం పరిష్కారం చూపిందన్న సీఎం... ఈ తరహాలోనే ఇతర భారీ ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు. ప్రాజెక్టు సందర్శనలో భాగంగా ఉదయం నుంచి కాళేశ్వరంలో పర్యటించిన కేసీఆర్ దంపతులు... ముక్తీశ్వరునికి, గోదారమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

cm kcr gave direction to godavari water release for yasangi season in kaleshwaram tour
సాగునీటి గోసకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం: సీఎం కేసీఆర్
author img

By

Published : Jan 19, 2021, 5:41 PM IST

సాగునీటి గోసకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం: సీఎం కేసీఆర్

కాళేశ్వరం స్ఫూర్తిగా రాష్ట్రంలోని ప్రాజెక్టులను పూర్తిచేసి... సాగునీటి గోసకు శాశ్వత పరిష్కారం చూపటమే లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ప్రాజెక్టు సందర్శనలో భాగంగా... సతీసమేతంగా కాళేశ్వరం వెళ్లిన ముఖ్యమంత్రికి... మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ , ఎర్రబెల్లి దయాకర్ తో పాటు సీఎస్, డీజీపీ, నీటిపారుదలశాఖ అధికారులు స్వాగతం పలికారు. హెలీప్యాడ్ నుంచి నేరుగా కాళేశ్వర, ముక్తేశ్వరస్వామి ఆలయానికి వెళ్లిన సీఎం దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు గోదావరి జలాలతో ముక్తేశ్వరస్వామికి అభిషేకం చేసి... అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కేసీఆర్ దంపతులకు ఆశీర్వచనాలు ఇచ్చిన అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.

గోదారమ్మకు పుష్పాంజలి

ప్రత్యేక బస్సులో ప్రాణహిత-గోదావరి సంగమ స్థలి పుష్కరఘాట్‌కు వెళ్లిన కేసీఆర్ దంపతులు... గోదారమ్మకు పుష్పాంజలి ఘటించి, నదిలో పసుపు కుంకుమలు, నాణేలను వదిలి మొక్కులు చెల్లించుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభ ఘట్టం.... నిర్మాణాలనాటి జ్ఞాపకాలను కేసీఆర్ పంచుకున్నారు. తెలంగాణలోని బీడు భూములను సస్యశ్యామలం చేస్తూ... రైతన్నకు వెన్నుదన్నుగా నిలిచే జలదృశ్యాన్ని వీక్షిస్తూ... ఆనందం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం లో నీటిపారుదల ఇంజినీర్ల కృషిని ఈ సందర్భంగా సీఎం కొనియాడారు.

విహంగ వీక్షణం

సంగమస్థలి నుంచి గోదావరిపై నిర్మించిన మొదటిదైన లక్ష్మీ బ్యారేజీ వద్దకు చేరుకునిపరిశీలించారు. విహంగ వీక్షణం ద్వారా మేడిగడ్డ ప్రాజెక్టును సీఎం పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణాల పురోగతి, పూర్తిస్థాయి నీటిమట్టంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సతీమణి శోభ, మంత్రులు, ఇతర నాయకులు, అధికారులతో కలిసి గోదావరి జలాలకు సీఎం పుష్పాభిషేకం చేశారు.

కార్మికుల యజ్ఞం
అనుకున్న సమయానికి ప్రాజెక్టు నిర్మాణాలు పూర్తికావటంపై సంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి... 50డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ వేలాది కార్మికులు చేపట్టిన యజ్ఞం చేశారని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించి... తుపాకుల గూడెం, దుమ్ముగూడెం బ్యారెజీలను త్వరితిగతిన పూర్తి చేసి సాగునీట గోసకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. అలాగే, మేడిగడ్డ, తుపాకులగూడెం, దుమ్ముగూడెం బ్యారేజీల వద్ద కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి... అన్ని ప్రాజెక్టులకు సంబంధించి ఆపరేషన్ రూల్స్ రూపొందించాలని తెలిపారు.

ఇదీ చూడండి: కాళేశ్వరంలో కేసీఆర్... గోదారి జలాలతో అభిషేకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.