పరిశ్రమలు వస్తే ఉపాధి పెరుగుతుందని, అందుకే రాయితీలు ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వైఎస్ఆర్, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో పారిశ్రామిక రాయితీలు ఇచ్చారని గుర్తుచేశారు. ఓసారి మహారాష్ట్ర సీఎం 3,500 కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చినట్టు తెలిపాారు. సాయం చేస్తే కుంభకోణం అంటూ ప్రచారాలు చేయడం తగదని కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు. సాయం చేసిన ప్రతిసారి ఒక కమిటీ వేసిన తర్వాతే రాయితీలు ఇస్తున్నట్టు స్పష్టం చేశారు.
ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అందుకోసం 14 వేల కోట్లు మార్క్‌ఫెడ్‌కు కేటాయించినట్లు వెల్లడించారు. తెలంగాణ నుంచే లక్షల కోళ్లు, గుడ్లు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో ఫౌల్ట్రీ రంగం నష్టపోకుండా ప్రభుత్వం సాయం చేస్తుందన్నారు.
ఇదీ చూడండి: కిస్కా జాగీర్ నహీ.. కిస్ కా బాప్‌కా బీ నహీ: భట్టీ