ETV Bharat / city

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ సమస్యలపై సీఎం దృష్టి - తెలంగాణ వార్తలు

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మిగిలిన అంశాల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు కార్యాచరణ ఖరారు చేయనున్నారు. పెండింగ్ మ్యుటేషన్లు, సాదా బైనామాలు, పార్ట్‌ బీలోని భూములకు సంబంధించిన అంశాలపై రేపు జరగనున్న మంత్రులు, కలెక్టర్ల సమావేశంలో సీఎం పూర్తిస్థాయిలో చర్చిస్తారు. క్షేత్రస్థాయి పరిస్థితుల ఆధారంగా సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి తగిన నిర్ణయాలు తీసుకోనున్నారు.

cm focus on agricultural land registration‌ issue
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ సమస్యలపై సీఎం దృష్టి
author img

By

Published : Jan 10, 2021, 4:17 AM IST

కొత్త రెవెన్యూ విధానంలో భాగంగా.. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లను తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ ద్వారా కొనసాగిస్తోంది. కొత్త విధానం కావడంతో అన్ని లావాదేవీలకు ఆస్కారం కలగలేదు. జీపీఏ, ఏజీపీఏలు.., లీజు డాక్యుమెంట్లు తదితరాలు పూర్తి స్థాయిలో రాలేదు. పెండింగ్ మ్యుటేషన్లు ఇంకా పరిష్కారం కాలేదు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ల లాగిన్‌లో.. పెండింగ్ మ్యుటేషన్ల సదుపాయం వచ్చింది. తదుపరి ప్రక్రియపై ప్రభుత్వం... ఆదేశాలు ఇవ్వాల్సి ఉంది. సర్వే వివాదాలు, విస్తీర్ణం తక్కువ, ఎక్కువ ఉన్న భూములు, డిజిటల్ సైన్ మిస్సింగ్ తదితర కేసులకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. పార్టు బీలో చేర్చిన భూములకూ.... పరిష్కారం రావాలి. సాదా బైనామాల క్రమబద్దీకరణ విషయంలోనూ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కొత్త ఆర్వోఆర్ చట్టంలో.. సాదాబైనామాల ప్రస్తావన లేనందున... ఆ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత స్వీకరించిన ఆరులక్షలా 70వేల దరఖాస్తుల క్రమబద్ధీకరణను ప్రారంభించవద్దని.. హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. రెవెన్యూ కోర్టుల్లో పెండింగ్‌ ఉన్న 16వేలకుపైగా కేసులను.. పరిష్కరించాల్సి ఉంది. మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో రేపు సమావేశం కానున్న ముఖ్యమంత్రి రెవెన్యూ సంబంధిత అంశాలపై.. చర్చించనున్నారు.

అన్ని వివరాలు తీసుకొని రావాలి..

పెండింగ్ మ్యుటేషన్లు, సాదా బైనామాల క్రమబద్ధీకరణ, ట్రైబ్యునళ్ల ఏర్పాటు, పార్ట్ బీలో చేర్చిన అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. రెవెన్యూకు సంబంధించిన అంశాలను.... త్వరగా పరిష్కరించేందుకు అవసరమైన కార్యాచరణను ఖరారు చేస్తారు. సమావేశం కోసం.. అన్ని వివరాలు తీసుకొని రావాలని..అధికారులను ఇప్పటికే సీఎం ఆదేశించారు. ప్రభుత్వ భూములకు సంబంధించి కూడా వాస్తవ, ఇచ్చిన, మిగిలిన విస్తీర్ణాల వివరాలను కూడా సిద్ధం చేస్తున్నారు. ధరణిలో ఇంకా పొందుపర్చాల్సిన అంశాలు, అన్నిరకాల భూములకు సంబంధించిన.. సమస్యలపై రేపటి సమావేశంలో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు.

ఇవీచూడండి: 11న మంత్రులు, కలెక్టర్లతో సీఎం సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.