ఎన్నో రాష్ట్రాల కంటే తెలంగాణ ఉత్తమంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బడ్జెట్లో కోతపై కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి వ్యాఖ్యలను ఖండించారు. కోత పెట్టడానికి కారణాలు సవివరంగా వివరించినా కూడా ఇలా మాట్లాడటం సబబు కాదన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో పడిన కోత కూడా వివరించామని తెలిపారు. మాటిమాటికి రాష్ట్రం దివాళా తీస్తుందని శాపనార్థాలు పెట్టొద్దని మండిపడ్డారు. ప్రపంచమంతా తెలంగాణ ప్రాజెక్టుల రికార్డుల గురించి చర్చిస్తుంటే...రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు కూడా కనిపించడం లేదనడం హాస్యాస్పదమన్నారు.
'మీరు చెప్పుడేంది... మేమే చెప్తున్నం' - budget 2019
"మీరు విమర్శించాలంటే విమర్శించండి. కోత పెట్టామని మీరు చెప్పేదేముంది... మేమే చెప్పాం. ఎందువల్ల కోత పెట్టామో కూడా సవివరంగా వివరించాం. మా వద్ద డబ్బులున్నా కోత పెట్టినట్లు మాట్లాడటం సబబు కాదు." - ముఖ్యమంత్రి కేసీఆర్