ETV Bharat / city

జాతీయ పార్టీ ఏర్పాటుపై కేసీఆర్ కసరత్తు.. పక్కా వ్యూహాలతో రంగంలోకి..

జాతీయపార్టీ ఏర్పాటుపై గులాబీ దళపతి కేసీఆర్​ కసరత్తు కొనసాగుతోంది. ముందుగా భాజపా వైఫల్యాలు... మతపరమైన రాజకీయాలను దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేసేలా... వ్యూహరచన జరుగుతోంది. యువత, రైతు సమస్యలపై ఉద్యమాలు చేపట్టాలని గులాబీ పార్టీ భావిస్తోంది. తెరాస అనే పేరు తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా ఉన్నందున.. అవే ఆంగ్ల అక్షరాలతో వచ్చేలా జాతీయ పార్టీ పేరు పెట్టాలని కార్యకర్తల నుంచి భారీగా సూచనలు వస్తున్నాయి.

CM KCR Exercise on national party
CM KCR Exercise on national party
author img

By

Published : Jun 19, 2022, 2:59 AM IST

జాతీయ పార్టీ ఏర్పాటుపై కేసీఆర్ కసరత్తు.. పక్కా వ్యూహాలతో ప్రణాళికలు..
జాతీయపార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన కేసీఆర్​... అందుకనుగుణంగా వివిధ కోణాల్లో విస్తృత సమాలోచనలు చేస్తున్నారు. భాజపా, కాంగ్రెస్ రెండింటికీ సమదూరం పాటిస్తూ... స్పష్టమైన అజెండాతో ప్రజల ముందుకెళ్లాలని నిర్ణయించారు. ప్రజల్లో భాజపాపై తీవ్రఅసంతృప్తి ఉందని కాంగ్రెస్ నాయకత్వంపై విశ్వాసం లేనందున.. జాతీయపార్టీ ఏర్పాటుకు ఇదే సరైన సమయమని తెరాస అధినేత గట్టిగా నమ్ముతున్నారు. కాంగ్రెస్‌పై ఎక్కువగా స్పందించకుండా... భాజపాపై ధ్వజమెత్తి దేశవ్యాప్తంగా ప్రజలను ఆకర్షించాలనేది కేసీఆర్​ వ్యూహం. భాజపా వైఫల్యాలు, మతతత్వ రాజకీయాలపై.. దేశవ్యాప్తంగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా ప్రణాళికలు చేస్తున్నారు. తొలిదశలో యువత, రైతులకు సంబంధించిన అంశాలపై ఉద్యమాలు రూపొందించాలని గులాబీ పార్టీ భావిస్తోంది.

దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో విద్యార్థులను భాగస్వామ్యం చేసేందుకు తగిన అంశాలపై కేసీఆర్​ బృందం అధ్యయనం చేస్తోంది. యువత అసంతృప్తిగా ఉన్న అంశాలపై ప్రశాంత్‌కిషోర్ బృందం.. ఒక నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. అన్ని విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో నెట్‌వర్క్ ఏర్పాటుకు.... తెరాస ప్రయత్నాలు చేస్తోంది. దేశంలో సాగునీరు, విద్యుత్ తగినంత అందుబాటులో ఉన్నా... వాటిని సద్వినియోగం చేసుకోవడంలో కేంద్రంలో పాలించిన భాజపా, కాంగ్రెస్ విఫలం కావడంవల్లే.. అన్నదాతలకు కష్టాలు తప్పట్లేదని ప్రచారం చేయనున్నారు. అందుకు గణాంకాలు, ఉదాహరణలతో పుస్తకాలు ముద్రించడంతో పాటు సామాజిక మాధ్యమాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు చేరవేసేలా వ్యూహరచన చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అంశాలతో పాటు.. వివిధ రాష్ట్రాల్లో స్థానిక ప్రజల ప్రత్యేక డిమాండ్లు, బలమైన ఆకాంక్షలేమిటీ... వాటిపై భాజపాతో పాటు అక్కడి పార్టీల వైఖరి ఏమిటనే అంశాలను ప్రశాంత్ కిషోర్ సహకారంతో గులాబీ పార్టీ పరిశీలిస్తోంది. వాటిపై స్థానిక ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.

భాజపా, కాంగ్రెస్‌కి దూరంగా ఉన్న వివిధ పార్టీల నేతలతో పాటు.... మేధావులు, ప్రముఖులు, విశ్రాంత అధికారులతో.... కేసీఆర్ నిరంతరం చర్చిస్తున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో చర్చించి... భాజపా విధానాల వల్ల దేశానికి జరగబోయే నష్టంపై ప్రజలకు మరింత సమర్థంగా వివరించాలని కోరారు. గతంలో వివిధ పార్టీల నేతలతో పాటు కర్ణాటకకు చెందిన నటుడు ప్రకాష్ రాజ్, తమిళ హీరో విజయ్ వంటి ప్రముఖులను అదే కోరినట్లు సమాచారం. భాజపాపై ధ్వజమెత్తతున్న నేతలు, ప్రజాసంఘాలు, సెలబ్రిటీలు, జర్నలిస్టులు, ఇతర ప్రముఖులందరితో..... ఫోన్లలో చర్చిస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి, రైతునేత టికాయత్, కార్మిక సంఘాలతోనూ సంప్రదింపులు చేశారు. భాజపాను వ్యతిరేకించే దాదాపు అన్ని పార్టీలతో సమాలోచనలు చేశారు. ఐతే భాజపా, కాంగ్రెస్‌కి సమదూరం అనే సంకేతం మాత్రం స్పష్టంగా ఉండేలా జాగ్రత్త వహిస్తున్నారు. కొన్ని పార్టీలు.... భాజపాను వ్యతిరేకిస్తున్నా......కాంగ్రెస్‌కు అనుకూల వైఖరితో ఉన్నందున.. ప్రస్తుతానికి వాటికి దూరంగానే ఉండాలని కేసీఆర్​ భావిస్తున్నారు. రాష్ట్రాల్లో అధికారంలో పార్టీలు కాకపోయినా.. జేడీఎస్​, ఆర్​జేడీ, మరో రెండు, మూడు పార్టీలు... కచ్చితంగా తమ వెంట కలిసి వస్తాయని గులాబీ బృందం విశ్వసిస్తోంది. దేశవ్యాప్తంగా కొంత నెట్‌వర్క్ ఏర్పడిన తర్వాత భారీ స్థాయిలో జాతీయ పార్టీ ప్రకటించాలా.. లేదా వెంటనే పార్టీ ప్రకటన చేసి అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లాలా అనే అంశంపై ఐదారు రోజుల్లో తుదినిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

జాతీయపార్టీని ఇప్పుడే ఎందుకు ఏర్పాటు చేయాలనుకుంటున్నారనే విషయంపై పార్టీశ్రేణులకు త్వరలో కేసీఆర్​ దిశానిర్దేశం చేయనున్నారు. ఈనెల 21 లేదా 22న జరగనున్న తెరాస విస్తృత స్థాయి భేటీలో పార్టీ నేతలకు ఆయన వివరించనున్నారు. జాతీయపార్టీ ఆలోచన వెనక కారణాలను శ్రేణులద్వారా గ్రామస్థాయి వరకు విస్తృతంగా తీసుకెళ్లేలా వ్యూహాలు రూపొందిస్తున్నారు. ఆ తర్వాతే.... ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించి జాతీయ పార్టీ ఏర్పాటుకు తీర్మానం చేయాలని గులాబీ పార్టీ యోచిస్తున్నట్లు సమాచారం. జాతీయపార్టీకి భారత్ రాష్ట్రీయసమితి లేదా భారతీయ రాజ్య్‌సమితి వంటిపేర్లపై కేసీఆర్​ మొగ్గుచూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. భారాస పేరు పరిశీలన ప్రచారంలోకి రాగానే.. పార్టీ శ్రేణుల నుంచి నాయకత్వానికి వివిధరూపాల్లో ఫీడ్‌బ్యాక్ పంపిస్తున్నారు. తెలంగాణ అస్తిత్వానికి మారుపేరుగా తెరాస ప్రజల్లో ఉందని.. ఆ పేరే ఒకఉత్తేజాన్ని నింపుతోందని పార్టీ శ్రేణులు నాయకత్వానికి చెబుతున్నాయి. కాబట్టి టీఆర్​ఎస్​ అనే ఆంగ్ల అక్షరాలు కొనసాగేలా జాతీయపార్టీ పేరు ఉండేలా చూడాలని సూచిస్తున్నారు. ఐతే భారత్‌ అనే పేరుఉంటేనే జాతీయపార్టీలా కనిపిస్తోందని.. టీఆర్​ఎస్​ పేరు యథాతథంగా ఉంటే ప్రాంతీయ పార్టీ అనే భావనే మనసుల్లో ఉంటుందేమోనని మరికొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. పార్టీ జెండా మాత్రం గులాబీ రంగులోనే కొనసాగించాలనే ఏకాభిప్రాయం ఉంది. కారు గుర్తు కొనసాగేందుకు అవసరమైన న్యాయ, చట్టపరమైన నిబంధనలను పరిశీలిస్తున్నారు

ఇవీ చూడండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.