ఏడాది పాటు ఘనంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. పీవీ పుట్టిన రోజైన జూన్ 28 నుంచి ఉత్సవాలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. పీవీ నరసింహారావు బహు విధాలుగా సేవలు అందించారని కొనియాడారు.
కేశవరావు ఆధ్వర్యంలో..
ఉత్సవాల నిర్వహణకు కేశవరావు ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. సభ్యులుగా ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, పీవీ కుమారుడు ప్రభాకర్ రావు, సభ్యులుగా పీవీ కుమార్తె వాణీదేవి, కరీంనగర్ జిల్లా మంత్రులు ఈటల, కేటీఆర్, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్ రావు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్‌తో పాటు మరో ఏడుగురిని కూడా కమిటీలో చేర్చుకోవాలని సీఎం సూచించారు.
కేశవరావు నివాసంలో గురువారం మధ్యాహ్నం కమిటీ మొదటి సమావేశం జరగనుంది. పీవీతో కలిసి పనిచేసిన వారు, ఆయనతో అనుబంధం కలిగిన వారు, కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులను సంప్రదించి, ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన కార్యక్రమాల రూపకల్పన చేయాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 269 కరోనా పాజిటివ్ కేసులు