రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసుల విషయంలో ప్రభుత్వానికి ఆందోళన ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. పాఠశాలల్లోనే ఎక్కువ కరోనా కేసులు రావటం పట్ల ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థులపై మహమ్మారి ప్రతాపం చూపుతున్న నేపథ్యంలో... తరగతులు కొనసాగించాలో... సెలవులు ఇవ్వాలో ఓ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. పాఠశాలల విషయంలో నిర్ణయాన్ని సభలోనే ప్రకటిస్తామని సీఎం తెలిపారు.