ETV Bharat / city

KCR Birthday Celebrations: ఘనంగా కేసీఆర్​ పుట్టినరోజు.. రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు - CM KCR Birthday

KCR Birthday Celebrations: రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి దళపతి... కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా సందడిగా సాగాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా.. ఉత్సవాల్లో ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని హోరెత్తించారు. అభిమాన నేతకు తమదైన రీతిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

CM KCR Birthday Celebrations in telangana statewide

author img

By

Published : Feb 17, 2022, 7:58 PM IST

Updated : Feb 18, 2022, 5:25 AM IST

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలు..
.

సీఎం కేసీఆర్‌ జన్మదినోత్సవాలు గురువారం రాష్ట్రంతోపాటు దేశవిదేశాల్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో మొక్క నాటి నీళ్లు పోస్తున్న సీఎం కేసీఆర్‌, శోభ దంపతులు. చిత్రంలో మంత్రి కేటీఆర్‌ సతీమణి శైలిమ, కుమార్తె అలేఖ్య, కేటీఆర్‌, ఆయన కుమారుడు హిమాన్ష్‌. ఈ కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి పావురాలను ఎగురవేశారు.

ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదినోత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. రాష్ట్రంతో పాటు దేశవిదేశాల్లోనూ పార్టీ శ్రేణులు, ఉద్యోగ సంఘాలు, సేవాసమితులు, అభిమానులు భారీఎత్తున కార్యక్రమాలను నిర్వహించారు. ‘హ్యాపీ బర్త్‌డే కేసీఆర్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్విటర్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. కొంపల్లిలో దివ్యాంగులకు 300 త్రిచక్ర వాహనాలను పంపిణీ చేశారు. అసెంబ్లీలో జరిగిన ఉత్సవాల్లో శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కేక్‌ను కోశారు. మండలి ప్రొటెం ఛైర్మన్‌ అమీనుల్‌ జాఫ్రి, మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అనంతరం మొక్కలు నాటారు. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి విరాళంగా ఇచ్చిన ఆంబులెన్స్‌ను కేటీఆర్‌ ప్రారంభించారు. మంత్రి హరీశ్‌రావు సిద్దిపేటలో రంగనాయక్‌సాగర్‌ ఎడమ కాలువల నుంచి రైతులకు గోదావరి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా సాగర్‌ కట్టపై కేక్‌ కోశారు. టీఎన్జీవో భవన్‌లో ఏర్పాటుచేసిన శిబిరంలో ఎమ్మెల్సీ కవిత రక్తదానం చేశారు.

.

తెలంగాణ భవన్‌లో..
మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ భవన్‌లో భారీఎత్తున వేడుకలు జరిగాయి. బోనాలు, బతుకమ్మలు, చెంచు, కోయ, ఒగ్గు కళాకారులు డప్పు, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. భారీ కేక్‌ను తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు కోశారు. కేసీఆర్‌ జీవిత చరిత్రపై 3డీ గ్రాఫిక్స్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌తో హిందీలో రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించారు. భవన్‌ ప్రధాన ద్వారం వద్ద త్రీడీ కాకతీయ కళాతోరణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టీఎన్జీవో, టీజీవో కార్యాలయాల్లో, ఆబ్కారీ కమిషనరేట్‌లో రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలను నిర్వహించారు.

.
.

రాష్ట్రవ్యాప్తంగా..
రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కేసీఆర్‌ ఆయురారోగ్యాలతో జీవించాలని మేడారంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావులు సమ్మక్క, సారలమ్మలను ప్రార్థించారు. నల్గొండలో మంత్రి జగదీశ్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఖమ్మంలో మంత్రి అజయ్‌కుమార్‌ నేతృత్వంలో వేడుకలు నిర్వహించారు. కరీంనగర్‌లో కేసీఆర్‌ సైకత శిల్పాన్ని రూపొందించారు. కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు, కార్పొరేటర్‌ సరితా అశోక్‌లు పేదలకు కోళ్లను పంపిణీ చేశారు. నిజామాబాద్‌లో తెరాస జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రైతుబంధు అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల వద్ద ఉత్సవాలను జరిపారు. కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా(కె) గ్రామంలో భాగ్యశ్రీ, చంద్రకాంత్‌ అనే దంపతులు తమ కుమారుడికి కేసీఆర్‌ పేరు పెట్టుకున్నారు. హైదరాబాద్‌ నగరంలోని పీపుల్స్‌ ప్లాజా వద్ద ఒడిశా కళాకారులు రూపొందించిన కేసీఆర్‌ సైకత శిల్పాన్ని ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ప్రారంభించారు. దిల్లీలో తుగ్లక్‌ రోడ్‌లోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో రాజ్యసభ సభ్యుడు కె.ఆర్‌.సురేష్‌రెడ్డి కేకు కోసి.. మొక్కను నాటారు.

సీఎం కేసీఆర్‌ కృతజ్ఞతలు
తనకు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేరుపేరునా ట్విటర్‌ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. వారి అభిమానానికి ధన్యుడినని ఆయన పేర్కొన్నారు.

.

నాన్నే నా హీరో: కేటీఆర్‌
అసాధ్యాన్ని సుసాధ్యం చేయడాన్ని కేసీఆర్‌ అలవాటుగా మార్చుకున్నారు. దయతో నిండిన హృదయంతో అందర్నీ ముందుకు నడిపిస్తున్నారు. కేసీఆర్‌కు సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే సత్తా ఉంది. ఆయన నా నాయకుడు.. నా తండ్రి.. అని గర్వంగా పిలుచుకుంటాను.

-మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌

తెలంగాణకు పండగ రోజు: హరీశ్‌రావు
కేసీఆర్‌ పుట్టినరోజు తెలంగాణకు పండగ రోజు. దశాబ్దాల తెలంగాణ కల కేసీఆర్‌ వల్లే సాకారమైంది. ఆయన సీఎం అయ్యాకే తెలంగాణ తలరాత మారింది. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని 5 కోట్ల ప్రజానీకం ఆకాంక్షిస్తోంది.

-మంత్రి హరీశ్‌రావు ట్వీట్‌

పచ్చని దీవెన..

.

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలోని కడియపులంకకు చెందిన గ్రీన్‌లైఫ్‌ నర్సరీ అధినేతలు తిరుమలశెట్టి శ్రీనివాసు, వాసు ఆధ్వర్యంలో 500 కిలోల కూరగాయలు, మొక్కలు, పూలు, నవధాన్యాలతో కేసీఆర్‌ ముఖచిత్రాన్ని అందంగా తీర్చిదిద్దారు. కరోనా విపత్తు సమయంలో హరితహారంలో భాగంగా కోటి మొక్కల సేకరణతో తెలంగాణ ముఖ్యమంత్రి ఆదుకున్నారని వారు తెలిపారు.

బీసీల ఆత్మబంధువు కేసీఆర్‌: గంగుల
ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీసీల అత్మబంధువు అని.. 41 బీసీ కులాలకు 82 ఎకరాల్లో రూ.90 కోట్లతో ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్డు జంక్షన్లో గురువారం 50 అడుగుల ఎత్తైన సీఎం కేసీఆర్‌ భారీ కటౌట్‌కు క్రేన్‌ ద్వారా క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగులతో పాటు 41 బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ ‘‘బీసీలను సీఎం కేసీఆర్‌ అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. మార్కెట్‌ కమిటీలతో పాటు మద్యం టెండర్లు, పారిశ్రామిక స్థలాల కేటాయింపు లాంటిలో రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు. బీసీలకు రాజధానిలోని కోకాపేట, ఉప్పల్‌ భగాయత్‌, మేడ్చల్‌, మల్కాజిగిరి తదితర ప్రాంతాల్లో అత్యంత విలువైన స్థలాలను కేటాయించారు’’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్సీ బండ ప్రకాశ్‌, నగర మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

.

ఇదీ చూడండి:

Last Updated : Feb 18, 2022, 5:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.