అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ సీబీఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌పై న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.
కౌంటర్ దాఖలు చేసిన జగన్.. బెయిల్ షరతులు ఉల్లంఘించలేదని పేర్కొన్నారు. రఘురామ పిటిషన్‌కు విచారణార్హత లేదని.. వ్యక్తిగత, రాజకీయాల కోసం న్యాయవ్యవస్థను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రఘురామ పిటిషన్‌ను కొట్టివేయాలని సీబీఐ కోర్టును జగన్ కోరారు.
మరోవైపు సీబీఐ కూడా న్యాయస్థానంలో మెమో దాఖలు చేసింది. రఘురామ పిటిషన్‌పై చట్టప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. కోర్టు విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాలని కోరింది. అనంతరం తదుపరి విచారణను సీబీఐ న్యాయస్థానం ఈనెల 14కు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: 'కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నాం'