ETV Bharat / city

ఉత్తమ పనితీరు కనబరుస్తున్న వాలంటీర్లకు సీఎం సన్మానం..

ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో సీఎం జగన్ రేపు పర్యటించనున్నారు. రాష్ట్రంలో ఉత్తమ పనితీరు కనబరుస్తున్న వాలంటీర్లను సన్మానించనున్నారు. సీఎం పర్యటన దృష్ట్యా భద్రతా అధికారులు.. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.

cm-jagan-will-visit-narasaraopet-in-palnadu-district-tomorrow

author img

By

Published : Apr 6, 2022, 10:12 PM IST

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. పల్నాడు జిల్లా నరసరావుపేటలో రేపు పర్యటించనున్నారు. జిల్లా క్రీడా ప్రాంగణంలో నిర్వహించే వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఉదయం 10.35 గంటలకు ఎస్.ఎస్.ఎన్.కళాశాల మైదానానికి హెలికాప్టర్​లో సీఎం జగన్ చేరుకుంటారు. కాసు వెంగళరెడ్డి విగ్రహావిష్కరణ, గడియార స్తంభం ప్రారంభోత్సవం తర్వాత నేరుగా స్టేడియంలోని సభా ప్రాంగణానికి చేరుకుంటారు. 11.50 గంటలకు సీఎం ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. తర్వాత వాలంటీర్లకు సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఇప్పటికే స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, పోలీసు యంత్రాంగం భద్రత, రవాణా ఏర్పాట్లను సమీక్షించింది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.