ETV Bharat / city

వైఎస్సార్ కాపు నేస్తం పథకానికి నేడే శ్రీకారం - వైఎస్సార్ కాపు నేస్తం పథకం వార్తలు

వైఎస్సార్ కాపు నేస్తం పథకాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్​మోహన్ రెడ్డి నేడు ప్రారంభించనున్నారు. అర్హులైన మహిళలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ. 15 వేల చొప్పున అందజేయనున్నారు. నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే వీటిని జమచేస్తారు.

వైఎస్సార్ కాపు నేస్తం పథకానికి నేడే శ్రీకారం

author img

By

Published : Jun 24, 2020, 9:18 AM IST

కాపు మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు 'వైఎస్సార్ కాపు నేస్తం' పథకానికి ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం ఇవాళ శ్రీకారం చుట్టనుంది. అర్హులైన కాపు మహిళలకు ఏటా రూ. 15 వేల చొప్పున అయిదేళ్లలో మొత్తం రూ.75 వేల ఆర్థిక సహాయం చేయనుంది. తొలి ఏడాది దాదాపు 2.36 లక్షల మంది అర్హులైన మహిళలకు సుమారు రూ. 354 కోట్ల ఆర్థిక సహాయం అందనుంది. నేరుగా వారి ఖాతాల్లోనే రూ. 15 వేల చొప్పున జమ చేస్తారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ ఈ పథకాన్ని ఇవాళ లాంఛనంగా ప్రారంభిస్తారు.

ఎవరు అర్హులంటే?

  • కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన 45- 60 వయసున్న మహిళలు
  • కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.44 లక్షలకు మించనివారు
  • కుటుంబానికి 3 ఎకరాల్లోపు మాగాణి/10 ఎకరాల మెట్ట భూమి లేదా రెండూ కలిపి 10 ఎకరాల లోపు ఉన్నవారు
  • పట్టణ ప్రాంతాల్లో ఎలాంటి ఆస్తి/ 750 చదరపు అడుగులకు మించిన ఇల్లు/ ఇతర ఏ నిర్మాణాలు లేనివారు
  • కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి లేకుండా, ప్రభుత్వ పింఛను పొందనివారు
  • కుటుంబానికి నాలుగు చక్రాల వాహనం ఉండనివారు(ఆటో, టాక్సీ, ట్రాక్టర్లకు మినహాయింపు)
  • కుటుంబంలో ఎవరూ కూడా పన్ను చెల్లింపుదారు లేనివారు

2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 'వైఎస్సార్ కాపు నేస్తం' పథకానికి తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 76,361 మంది లబ్ధిదారులు ఉన్నారు. విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 3726 మంది మాత్రమే ఉన్నారు.

ఇదీ చదవండి: హైదరాబాద్​ను వణికిస్తున్న కరోనా... జీహెచ్​ఎంసీలో 62శాతం కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.