ETV Bharat / city

సీఎం జగన్ పాల్గొన్న సభలో ఉక్కపోతతో ప్రజల ఇబ్బందులు

ఏపీ తిరుపతి వేదికగా ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్న జగనన్న విద్యాదీవెన బహిరంగ సభలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎండ తీవ్రతకు ఇబ్బందులు పడ్డారు. సభ పూర్తయ్యే వరకూ ఎవరూ బయటికి వెళ్లకుండా పోలీసులు, మెప్మా అధికారులు మైదానం గేట్లన్నీ మూసివేయటంతో ఉక్కపోతతో అల్లాడిపోయారు.

Jagan anna  Vidyadivena with the participation of Chief Minister Jagan
ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్న జగనన్న విద్యాదీవెన
author img

By

Published : May 5, 2022, 6:21 PM IST

ఏపీ తిరుపతిలో నిర్వహించిన జగనన్న విద్యాదీవెన బహిరంగ సభ పద్మవ్యూహాన్ని తలపించింది. ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్న ఈ సభకు భారీగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులను తరలించారు. అలాగే మహిళా సంఘాల సభ్యులను తీసుకొచ్చారు. సభ పూర్తయ్యే వరకూ ఎవరూ బయటికి వెళ్లకుండా పోలీసులు, మెప్మా అధికారులు మైదానం గేట్లన్నీ మూసివేశారు. అయితే 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్న వేళ సభా ప్రాంగణంలో తీవ్రమైన ఉక్కపోతను విద్యార్థులు, తల్లిదండ్రులు, మహిళా సంఘాల సభ్యులు భరించలేకపోయారు.

ఎండ తీవ్రతను తట్టుకోలేకపోతున్నామని, నీరసం వస్తున్నందున బయటికి పంపాలని ప్రాధేయపడినా పోలీసులు, మెప్మా అధికారులు లెక్కచేయలేదు. వారిని బెదిరించి గేట్ల వద్దే నిలువరించారు. ఓపిక నశించిన మహిళా సంఘాల సభ్యులు పోలీసుల తీరుపై మండిపడ్డారు. గేట్లు తోసుకుని బయటికి వెళ్లిపోయారు. విద్యార్థులైతే పది అడుగుల ప్రహరీ దూకేశారు. అలా వెళ్లలేకపోయిన కొందరు మహిళలు నీరసంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ పరిస్థితుల్లో చేసేదేమీ లేక ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్న సమయంలోనే అధికారులు గేట్లు తెరిచారు. అప్పటిదాకా ఉక్కపోతతో అల్లాడిపోయిన మహిళలు గేట్లు తీశాక అక్కడి నుంచి బయటపడ్డారు.

జగనన్న విద్యాదీవెన బహిరంగ సభలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎండ తీవ్రతకు ఇబ్బందులు

ఇదీ చదవండి: ఎమ్మెల్యేకు రైతుల నిరసన సెగ.. వాగ్వాదానికి దిగటంతో అసహనంగా..

జమ్ముకశ్మీర్​లో నియోజకవర్గాల పునర్విభజన పూర్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.