ETV Bharat / city

AP CM Jagan: 'ఆదాయం తగ్గినా.. ప్రజలకు సంక్షేమం అందిస్తున్నాం'

author img

By

Published : Jan 10, 2022, 1:57 PM IST

CM Jagan Inaugurated Oxygen Plants: ఏపీలో 50 పడకలు దాటిన 133 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్లను సీఎం జగన్‌ వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. కొవిడ్ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతోందని.. ఆదాయం తగ్గినా ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నామని సీఎం జగన్​ అన్నారు.

cm jagan
సీఎం జగన్​
ఆదాయం తగ్గినా.. ప్రజలకు సంక్షేమమే లక్ష్యం: జగన్​

CM Jagan Inaugurated Oxygen Plants: ఆంధ్రప్రదేశ్​లో 144 ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని సీఎం జగన్​ తెలిపారు. 32 ఆక్సిజన్ ప్లాంట్లు జాతికి అంకితం చేశామని పేర్కొన్నారు. ఆక్సిజన్ ప్లాంట్లను ప్రభుత్వం సొంతంగా ఏర్పాటు చేస్తోందని జగన్​ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 50 పడకలు దాటిన 133 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్లను సీఎం జగన్‌ వర్చువల్‌ విధానంలో సీఎం ప్రారంభించారు.

ఆదాయం తగ్గినా.. సంక్షేమం

50 పడకల ఆస్పత్రుల్లోనూ ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని సీఎం జగన్​ అన్నారు. 100 పడకలకు పైగా ఉన్న 71 ప్రైవేట్​ ఆస్పత్రుల్లో ప్లాంట్లకు 30 శాతం రాయితీ ఇచ్చినట్లు తెలిపారు. అన్ని ప్లాంట్లు పూర్తైతే 247 చోట్ల ఆక్సిజన్ తయారీకి అవకాశం ఉంటుందన్నారు. కొవిడ్ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతోందని.. ఆదాయం తగ్గినా ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నామని సీఎం జగన్​ అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 144 ఆక్సిజన్​ ప్లాంట్లకు ప్రారంభోత్సవం చేస్తున్నాం. ఇటీవల 32 ప్లాంట్లను జాతికి అంకితం చేశాం. ఇందుకోసం రూ. 424 కోట్ల నిధులు వినియోగిస్తున్నాం. మరో 71 చోట్ల ప్రైవేట్​ ఆస్పత్రుల్లో సొంతంగా ఆక్సిజన్​ ఉత్పత్తి చేసే ప్లాంట్లను నెలకొల్పడానికి 30 శాతం రాయితీ ఇస్తున్నాం. కొవిడ్​ మహమ్మారి వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గుతున్నా.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. --- జగన్​

1000, 500 ఎల్‌పీఎం (లీటర్‌ ఫర్‌ మినిట్‌) సామర్థ్యంతో ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 21, తూర్పుగోదావరిలో 13, శ్రీకాకుళం, విశాఖ, కృష్ణా జిల్లాల్లో 12 చొప్పున ఈ ప్లాంట్లను నెలకొల్పారు. మరో 11 ప్లాంట్లు నిర్మాణంలో ఉన్నాయి. కొవిడ్‌ మూడో దశను ఎదుర్కొనే చర్యల్లో భాగంగా ఆక్సిజన్‌ పైపులైన్లు, నిల్వ కోసం ట్యాంకర్ల ఏర్పాటుతోపాటు ఆక్సిజన్‌ రవాణాకు 25 ట్యాంకర్లను కొనుగోలు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.

ఇదీ చదవండి: అక్కడకు వెళ్లడానికి వీల్లేదు.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.