కరోనా నివారణ చర్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్షించారు. కరోనా నివారణ అధ్యయన వివరాలను ప్రభుత్వ సలహాదారు శ్రీనాథ్‌రెడ్డి ముఖ్యమంత్రికి అందించారు. కరోనా వ్యాప్తి స్థితిగతులు, నివారణ చర్యలపై ఏపీ సీఎం అధికారులతో చర్చించారు. ఈ రోజు ఉదయం 9 గంటల వరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని అధికారులు తెలిపారు. దిల్లీ వెళ్లి వచ్చిన వారు, వారిని కలిసిన వారి వల్లే కేసులు పెరిగాయని తెలిపారు.
మూడోసారి సమగ్ర కుటుంబ సర్వే జరగాలి: జగన్
ఏపీలో మూడోసారి సమగ్ర కుటుంబ సర్వే జరపాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిపై సర్వే చేసి, వివరాలు నమోదు చేయాలని సూచించారు. పొరపాట్లకు తావు లేకుండా ప్రక్రియ కొనసాగాలన్నారు.
ఐసోలేషన్ వార్డుల ఏర్పాటుపై సమగ్ర నివేదిక ఇవ్వాలి: జగన్
ప్రతి ఆస్పత్రిలో ఐసొలేషన్ వార్డు ఏర్పాటుపై సీఎం జగన్ చర్చించారు. పరిస్థితిపై రోజువారి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
రైతులను పూర్తిగా ఆదుకోవాలి: సీఎం
వ్యవసాయంపై కరోనా ప్రభావం, తీసుకుంటోన్న చర్యలపై సీఎం ఆరా తీశారు. రవాణా విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. ధాన్యం సరఫరాకు ఎన్ని లారీలు కావాలో చూసి..ఆ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు.
పండ్లను రైతులు స్థానిక మార్కెట్లలో అమ్మేందుకు చర్యలు తీసుకున్నామని అధికారులు వివరించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా అరటి విక్రయం ప్రారంభించామని తెలిపారు.
ఇవీ చూడండి: 'తల్లి కన్నా... దేవుడికన్నా... వైద్యుడి త్యాగం గొప్పది'