ETV Bharat / city

AP CM JAGAN: కేసుల సంఖ్య తగ్గుతోంది.. అయినా నిబంధనలు పాటించాల్సిందే: ఏపీ సీఎం - సీఎం జగన్ తాజా వార్తలు

కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు తగ్గుతోందని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. కలెక్టర్లతో స్పందన కార్యక్రమంపై సమీక్షించిన ఆయన.. పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. కొవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. ఇదే సమయంలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించాలని స్పష్టం చేశారు. రైతులకు ఆర్‌బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు అందించేలా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నకిలీ విత్తనాలను ఆరికట్టేందుకు కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

AP CM JAGAN
ఏపీ సీఎం జగన్​
author img

By

Published : Jun 16, 2021, 8:07 PM IST

స్పందన కార్యక్రమంపై కలెక్టర్లతో ఏపీ సీఎం జగన్‌ సమీక్షించారు. కొవిడ్, ఉపాధిహామీ, అర్బన్‌ క్లినిక్స్, ఇళ్లపట్టాలు, ఖరీఫ్‌ సన్నద్ధతపై చర్చించారు. ఈ నెల 20 తర్వాత కర్ఫ్యూలో కొన్ని సడలింపులుంటాయని సీఎం జగన్‌ వెల్లడించారు. కొవిడ్‌ నియంత్రణలో కలెక్టర్లు, సిబ్బంది అద్భుతంగా పనిచేశారని కితాబునిచ్చారు. కేసుల సంఖ్యతో పాటు పాజిటివిటీ రేటు కూడా తగ్గుతోందన్నారు. అయితే కొవిడ్‌ ఎప్పటికీ కూడా జీరోస్థాయికి చేరుతుందని అనుకోవద్దని చెప్పారు. ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ అందించాలన్న సీఎం జగన్.. కొవిడ్‌ ప్రోటోకాల్స్‌ను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. మాస్కులు, శానిటైజర్లు తదితర చర్యలన్నీ కొనసాగాలని.. ఇవన్నీ జీవితంలో భాగం కావాలన్నారు.

'గ్రామాల్లో చేస్తున్న ఫీవర్‌సర్వే కార్యక్రమాలు ప్రతి వారం కొనసాగాలి. ప్రతి ఇంటికీ వెళ్లి సర్వే చేసి పరీక్షలు చేయాలి. ఎవరు కొవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్నా.. పరీక్షలు చేసి వెంటనే వైద్యం అందించాలి. ఫీవర్‌ సర్వే కార్యక్రమం ప్రతి వారం కొనసాగాలి. టెస్టుల ఇష్టానుసారం కాకుండా ఫోకస్‌గా, లక్షణాలు ఉన్నవారికి చేయాలి. ఎవరైనా కొవిడ్‌ పరీక్షలు చేయమని అడిగితే వారికి కూడా చేయాలి. అన్ని టెస్టులు కూడా ఆర్టీపీసీఆర్‌ మాత్రమే ఉండాలి. ఆరోగ్య శ్రీ అమల్లో కలెక్టర్లను అభినందిస్తున్నాను. 89శాతం మంది కొవిడ్‌ ట్రీట్‌మెంట్‌ను ఆరోగ్యశ్రీ కింద తీసుకున్నారు. పేదవాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్థికంగా భారంపడకుండా కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రయివేటు ఆస్పత్రులపై కూడా కలెక్టర్లు దృష్టిపెట్టాలి. ప్రభుత్వం ప్రకటించిన రేట్లుకన్నా.. ఎక్కువ ఛార్జి చేయకూడదు. ఎవరైనా వసూలు చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలి. అలా చేసిన ఆస్పత్రులను మూసివేయడానికి కూడా కలెక్టర్లు సంకోచించవద్దు' - ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

కొవిడ్ మహమ్మారి సమయంలో ప్రజలను పీడించుకుతినే ఆలోచనలు ఉన్నవారిపై కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. మొదటిసారి ఉల్లంఘిస్తే పెనాల్టీలు వేయాలని.. రెండోసారి చేస్తే క్రిమినల్‌కేసులు చేయాలన్నారు.104 నంబర్‌ను తప్పనిసరిగా ఓన్‌చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. థర్డ్‌వేవ్‌ వస్తుందో, లేదో తెలియన్న సీఎం.. సిద్ధంగా ఉండటం అన్నది మన చేతుల్లోని అంశమని చెప్పారు. థర్డ్ వేవ్ వచ్చినా.. ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలన్నారు. ఈ వేవ్ లో పిల్లలు ప్రభావితం అవుతారని చెబుతున్నారని.. ఈ అంశాలను కలెక్టర్లు దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. చక్కటి కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లాస్థాయిలో వచ్చే 2 నెలలకు కార్యాచరణ సిద్ధం చేసి అమలు చేయాలని చెప్పారు. ఇందులో భాగంగానే పిల్లల వైద్యం కోసం మూడు అత్యాధునికి ఆస్పత్రులను తీసుకొస్తున్నామని గుర్తు చేశారు.

'వ్యాక్సినేషన్‌ అన్నది చాలా ముఖ్యమైనది. నిర్దేశించుకున్న విధివిధానాల ప్రకారం వ్యాక్సినేషన్‌ ఇవ్వాలి. మార్గదర్శకాలను తప్పక పాటించాలి. మూడున్నర కోట్ల మందికి వ్యాక్సిన్‌ ఇవ్వాల్సి ఉంటే.. ఇందులో 26,33,351 మందికి మాత్రమే రెండు డోసుల వ్యాక్సిన్లు ఇవ్వగలిగాం. మరో 69,0,710 మందికి మాత్రమే ఒకడోసు ఇచ్చాం. వ్యాక్సినేషన్‌ విషయంలో మనం చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. అందుకనే నిర్దేశించుకున్న విధివిధానాలను పారదర్శకంగా అమలు చేయాలి'- సీఎం జగన్

రైతులకు నాణ్యమైన విత్తనాలే అందాలని కలెక్టర్లతో స్పందన కార్యక్రమంలో సీఎం జగన్‌ స్పష్టం చేశారు. నకిలీ విత్తనాలు అరికట్టేందుకు కలెక్టర్లు చర్యలు చేపట్టాలన్నారు. రైతులకు ఆర్‌బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు అందాలని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: CP Anjani kumar: జోకర్‌ మాల్‌వేర్‌ ఓపెన్ చేస్తే అంతే సంగతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.